Ex US Secretary Of State On India-Pak Nuke Threat After Balakot: బాలాకోట్ దాడుల అనంతర పాకిస్తాన్, భారత్ పై అణుదాడికి సిద్ధం అయిందని వెల్లడించారు అమెరికా మాజీ విదేశాంగమంత్రి మైక్ పాంపియో. ఈ విషయాన్ని అప్పటి భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా నాలో చెప్పారని.. ఆ సమయంలో నేను వియత్నాంలోని హనోయ్ లో ఉన్నానని.. అణుదాడికి ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం అవుతుందనే మాటతోనే నేను నిద్ర లేచానని వెల్లడించారు. తాజాగా ఆయన రచించిన ‘నెవర్ గివ్ యాన్ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్’’ పుస్తకంలో వెల్లడించారు. 2019 ఫిబ్రవి 27-28 తేదీల్లో యూఎస్-నార్త్ కొరియా సమ్మిట్ కోసం హనోయ్ లో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగినట్లు గుర్తు చేసుకున్నారు.
Read Also: Pakistan: అంధకారంలో పాకిస్థాన్.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం
భారత్-పాక్ అణు యుద్ధానికి ఎంత దగ్గరగా వచ్చాయనే విషయం ప్రపంచానికి సరిగ్గా తెలియదని.. పరిస్థితిని చక్కదిద్దడానికి సుష్మా స్వరాజ్ ను నాకు ఒక నిమిషం సమయం ఇవ్వాలని అడిగానని.. ఆ సమయంలో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ కమర్ జావేద్ బజ్వాతో మాట్లాడనని, అయితే తాము ఎలాంటి అణుయుద్ధానికి దిగడం లేదని, భారత్ మాపై అణు దాడి చేయాలని అనుకుంటోందని ఆరోపించారని.. అయితే భారత్ అలాంటి ప్రయత్నాలు ఏం చేయలేదని చెప్పానని అన్నారు. ఆ రోజు మేం చేసిన పనిని మరే దేశం చేసి ఉందడని ఆయన వెల్లడించారు. ఆ సమయంలో న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ లోని మా బృందాలు అద్భుతంగా పనిచేశాయని ఆయన అన్నారు.
2019లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి కారణం అయ్యారు ఉగ్రవాదులు. ఆ సమయంలో భారత యుద్ధవిమానాలు పాకిస్తాన్ బాలకోట్ లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయి. ఇదే సమయంలో మన పైలెట్ అభినందన్ వర్థమాన్ తన మిగ్ బైసన్ యుద్దవిమానంతో అత్యంత ఆధునాతనమైన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేశాడు. ఆ తరువాత ఆయన విమానం కూలి పాకిస్తాన్ సైన్యానికి చిక్కాడు. ఆ తరువాత అంతర్జాతీయ ఒత్తిడితో పాక్ దిగివచ్చి అభినందన్ వర్థమాన్ ను భారత్ కు అప్పగించింది.