Telangana Cabinet Meeting: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం అవుతోంది. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 5న ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బడ్జెట్ పై చర్చించి, కేబినెట్ ఆమోదం తెలపనున్నారు. దీంతో పాటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీలో 6వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో భారీ బడ్జెట్ తో రాబోతోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. దాదాపుగా 3లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
Read Also: Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో నెయ్యి, వంట నూనెల కొరత..
ఇదిలా ఉంటే రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. అయితే అందరి కళ్లు గవర్నర్ తమిళిసై ప్రసంగం పైనే ఉన్నాయి. రెండు సభలను ఉద్దేశించి తమిళిసై ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 6న ఆర్థికమంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 15 వరకు సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది. అయితే బీఏసీ మీటింగ్ తర్వాత ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే దానిపై మరింత స్పష్టంగా వస్తుంది. రాజ్ భవన్, ప్రభుత్వం సంబంధాలు మెరుగుపడుతాయా..? లేక పోతే రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ లా వివాదం మారుతుందా..? అనే అనుమానాలు ప్రజల్లో ఉంది. వీటన్నింటికి రేపటితో క్లారిటీ రాబోతోంది. ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు, అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు బడ్జెట్ లెక్కలతో రెడీ అవుతున్నాయి. మరోసారి అధికారంలోకి రావడానికే, అంకెల బడ్జెట్ ను ప్రవేశపెడతారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. ప్రజాసమస్యలపై సభలో చర్చించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.