Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలనం..ఈడీ ఛార్జీషీట్‌లో కేజ్రీవాల్ పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ లో ఈడీ రెండో చార్జీషీట్ లో కీలక వ్యక్తుల పేర్లను చేర్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును కూడా చేర్చింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మరో 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఈ మొత్తం కేసులో విజయ్ నాయర్ కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈ ఛార్జీషీట్ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ఈడీ అవినీతిని అడ్డుకునేందుకు పనిచేయడం లేదని.. ప్రభుత్వాలను కూల్చివేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Read Also: FedEx Layoffs: ఉద్యోగులకు ఫెడ్‌ఎక్స్ షాక్..తామూ ఆ దారిలోనే అంటూ!
Also Read
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
ఇదిలా ఉంటే మరో కీలక విషయాన్ని కూడా ఛార్జీషీటులో ప్రస్తావించింది. గతేడాది గోవా ఎన్నికల సమయంలో లిక్కర్ స్కాంలో వచ్చిన డబ్బును ఆప్ ఉపయోగించినట్లు ఈడీ పేర్కొంది. గోవాలో ఆప్ తరుపున సర్వే చేసిన వాలంటీర్లకు దాదాపుగా రూ. 70 లక్షల నగదును చెల్లించినట్లు తెలిపింది. ఈ ఎన్నికల్లో ఆప్ రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆప్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ విజయ్ నాయర్, ప్రచారానికి సంబంధించిన పనిచేసిన వ్యక్తులకు నగదు రూపంలోనే తీసుకోవాలని చెప్పారని ఈడీ ఆరోపించింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్‌పల్లి, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహాయకుడు దినేష్ అరోరాతో కలిసి కుట్రపన్ని నగదు బదిలీకి సహకరించారని ఈడీ తెలిపింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో జరిగిన అవకతవకలపై ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ వినయ్ కుమార్ సక్సోనా సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. దీంతో ఈ మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నవంబర్ 17, 2021 నుంచి జూలై, 2022 అమలైన ఈ కొత్త లిక్కర్ స్కాంను సీబీఐ విచారణ అనంతరం ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియా పేరు కూడా ఉంది. తాజాగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేరును కూడా చేర్చింది.
తాజావార్తలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!