Freedom App: రైతులు, చిన్న వ్యాపారులు తమ ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు, ఆర్థిక స్వేచ్ఛను సాధించడానికి దోహదపడుతున్న ఫ్రీడమ్ యాప్ కోటి డౌన్‌లోడ్‌లను దాటింది. ప్రారంభించిన 33 నెలల వ్యవధిలోనే ప్రజాధరణ పొందింది. ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మళయాళం వంటి స్థానిక భాషల్లో కూడా కంటెంటు రూపొందించడంతో ప్రజలకు చేరువైంది. ప్రస్తుతం వ్యవసాయం, వ్యాపారం రంగాల్లో 960 కోర్సులను కలిగి ఉంది. ఈ యాప్ ప్రతీ వారం, ప్రతీ భాషలో కొత్త కోర్సును విడుదల చేస్తోంది. ఈ రంగాల్లో నిష్ణాతులైన 800 మందితో కోర్సులను రూపొందించింది ఫ్రీడమ్ యాప్. స్థానిక భాషల్లో కూడా యాప్ అందుబాటులో ఉండటంతో ప్రజలకు చేరువ కావడంతో తక్కువ కాలంలో ఈ యాప్ ఎక్కువ డౌన్‌లోడ్‌లను పొందింది.
Read Also: Nijam With Smitha: టాలీవుడ్ చీకటి కోణాన్ని స్మిత నిర్భయంగా బయటపెడుతుందట..?
భారతదేశం ప్రస్తుతం 3.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉందని.. రైతులు, సూక్ష్మ, చిన్న వ్యాపారాలు, పెద్ద కార్పొరేట్‌ల సహకారంతో ఈ లక్ష్యాన్ని 5 ట్రిలియన్ల జిడిపిని చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు యాప్ సీఈఓ సుధీర్ వెల్లడించారు. మార్చి 20, 2020లో ప్రారంభించిన ఈ యాప్ ప్రస్తుతం 10 మిలియన్ల డౌన్ లోడ్లను దాటింది. ఈ కంపెనీ మొత్తం 18 యూట్యూబ్ ఛానెళ్లను నిర్వహిస్తోంది. 2.5 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది.