Revanth Reddy: ప్రజలు సీఎం కేసీఆర్ కు ఇచ్చిన అవకాశం ముగిసిందని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, రైతులకు 24 గంటల విద్యుత్ పై కేసీఆర్ ఆడంబరపు ప్రకటనలు ఇచ్చారని మండిపడ్డారు. ఆనాడు బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమంతో ప్రభుత్వం కూలిపోయిందని గుర్తు చేశారు. ప్రైవేటు విద్యుత్ సంస్థల్లో 50 శాతం కమిషన్లు దండుకున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు.
Turkey Earthquake: టర్కీ భూకంపంలో వెలుగులోకి వస్తున్న ఎన్నో ఫోటోలు ప్రపంచంతో కన్నీరు పెట్టిస్తున్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. సహాయచర్యల కోసం చూడకుండా తమ వారిని రక్షించుకునేందుకు ప్రజలు పడుతున్న తాపత్రేయం హృదయవిదారకంగా ఉంటున్నాయి. శిథిలాల కింద పుట్టిన శిశువు, పట్టగానే అనాథగా మారిన సంఘటనలు సిరియా దేశంలో వెలుగులోకి వచ్చింది.
Pakistan: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతూ దివాళా అంచుకు చేరుకుంటోంది. కానీ ఆ దేశ సైన్యం మాత్రం ఏదో ఒక హడావిడి చేస్తూనే ఉంది. మాట మాట్లాడితే తమ వద్ద అణుబాంబులు ఉన్నాయని భయపెడుతుంది తప్పితే.. అక్కడి ప్రజల ఆకలిని మాత్రం తీర్చలేకపోతోంది. ఉగ్రవాద దేశంగా ముద్ర పడిన పాకిస్తాన్, నానాటికి ప్రపంచంలో ఒంటరిగా మారుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తన ఆల్ వెదర్ ఫ్రెండ్ చైనా కూడా ప్రస్తుతం ముహం చాటేస్తోంది. ఇన్నాళ్లు పాకిస్తాన్ కు డాలర్లు ఇస్తూ ఆదుకుంటూ వచ్చిన సౌదీ…
Lithium Reserves: దేశంలో తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ లో లిథియం నిల్వలను కనుక్కున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. 5.9 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నట్లు వెల్లడించింది. లిథియం నాన్-ఫెర్రస్ మెటర్. సెల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో లిథియంను విరివిగా ఉపయోగిస్తారు. జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో ఈ నిల్వలు ఉన్నట్లు గనుల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.
Vande Bharat trains: దేశంలో వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. భారత రైల్వేకు ఆధునిక హంగులు తీసుకురావడంతో పాటు రైళ్ల వేగాన్ని పెంచేందుకు వందే భారత్ రైల్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే 8 వందే భారత్ రైళ్లు పలు మార్గాల్లో ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈ రోజు(శుక్రవారం) మరో రెండు వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.
China Spy Balloon: అమెరికా, చైనాల మధ్య స్పై బెలూన్ వివాదం నడుస్తూనే ఉంది. చైనా బెలూన్ సాయంతో పలు దేశాలపై గూఢచర్యం చేసినట్లు అమెరికా ఆరోపిస్తోంది. చైనా ఆర్మీ ఏకంగా బెలూన్ ప్లీట్ ను నిర్వహిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇటీవల అమెరికా గగనతలంలో చైనా బెలూన్ కనిపించింది. దీన్ని అమెరికా ఎయిర్ ఫోర్స్ కూల్చేసింది. దీనిపై ప్రస్తుతం అక్కడి అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. బెలూన్ ద్వారా ఎలాంటి సమాచారాన్ని సేకరించారు, ఏ శాటిలైట్ తో ఈ బెలూన్ కనెక్ట్ అయి ఉందనే వివరాలను…
Turkey Earthquake: టర్కీ, సిరియా భూకంపంలో అంతకంతకు మరణాల సంఖ్య పెరుగుతోంది. సోమవారం టర్కీలో 7.8, 7.5 తీవ్రతతో భారీ భూకంపాలు వచ్చాయి. ఏకంగా 1000కి మించి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో టర్కీ, సిరియాలో భారీగా ఆస్తి, ప్రాణనష్టం ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు భూకంపం వల్ల టర్కీలో 17,674 మంది, సిరియాలో 3,377 మంది మరణించారని, మొత్తం 21,051 మంది మరణించారని అధికారులు వెల్లడించారు.
Pakistan Economic Crisis: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్, ఐఎంఎఫ్ బెయిలౌట్ సాయంతో బయటపడవచ్చని భావించింది. ఇప్పటికే మిత్రదేశాలు అప్పు ఇవ్వలేమని చెప్పడంతో చివరి అవకాశంగా ఐఎంఎఫ్ తో గత పది రోజుల నుంచి పాక్ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఐఎంఎఫ్ ఇచ్చే ఆర్థిక సాయంతో బయటపడవచ్చని భావించింది. అయితే ఐఎంఎఫ్ తో పాక్ ప్రభుత్వం చర్చలు విఫలం అయినట్లు అక్కడి మీడియా చెబుతోంది.
Yahoo Layoff: టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ పర్వం నడుస్తూనే ఉంది. రోజుకో టెక్ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంటోంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో అని ఐటీ ఉద్యోగులు గుబులు పడిపోతున్నారు. ఉన్నపలంగా ఉద్యోగం నుంచి తొలగిస్తే తమ పరిస్థితి ఏంటని భయపడుతున్నారు ఉద్యోగులు. ఇప్పటికే టెక్ దిగ్గజ కంపెనీలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్ లు తమ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఆర్థిక మాంద్యం భయాలతోనే ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతోనే కంపెనీలు ఇలా చేస్తున్నాయి.
Rajasthan: రాజస్థాన్ దౌసాలో భారీగా పేలుడు పదార్ధాలు పట్టుబడ్డాయి. పోలీసులు గురువారం 1,000 కిలోల పేలుడు పదార్థాలతో దౌసాకు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని రాజేష్ మీనాగా గుర్తించారు. అయితే ఈ పేలుడు పదార్థాలు మొత్తం అక్రమ మైనింగ్ కు సంబంధించినవిగా పోలీస్ అధికారులు నిర్థారించారు. నిందితుడి వద్ద నుంచి 65 డిటోనేటర్లు, 13 వైర్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు సమాచారం రావడంతో వాహనాలను తనిఖీ చేస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు లభించాయి. దీనిపై మరింత లోతుగా విచారణ చేస్తున్నారు…