Sperm Donation: చైనాలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. చైనా వ్యాప్తం వీర్యం కోసం పలు స్పెర్మ్ బ్యాంకులు దానం చేయాలని కోరుతున్నాయి. ముఖ్యంగా యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులను డొనేట్ చేయాలని అక్కడి స్పెర్మ్ బ్యాంకులు విజ్ఞప్తి చేస్తున్నాయి. బీజింగ్, షాంఘైతో పాటు ప్రధాన నగరాల్లో ఈ ట్రెండ్ నడుస్తోంది. యూనివర్సిటీ విద్యార్థులు ఇది ఓ ఆదాయ మార్గంగా , చైనాలో పడిపోతున్న సంతానోత్పత్తి రేటును ఎదుర్కోవడానికి మార్గంగా దోహదం చేస్తుందని అక్కడి స్పెర్మ్ బ్యాంకులు భావిస్తున్నాయి.
స్పెర్మ్ దానం చేయాలని వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో చైనీస్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ వైబోలో ప్రస్తుతం ఇది ట్రెండింగ్ టాపిక్ గా ఉంది. అక్కడి నెటిజెన్లు దీనిపై తెగ చర్చించుకుంటున్నారు. ఫిబ్రవరి 2న నైరుతి చైనాలోని యునాన్ హ్యూమన్ స్పెర్మ్ బ్యాంక్ స్పెర్మ్ డొనేషన్ కోసం యూనివర్శిటీ విద్యార్థులను కోరింది. దీనివల్ల ప్రయోజనాలు, రిజిస్ట్రేషన్ షరతులు, సబ్సిడీ, డొనేషన్ విధానం గురించి పరిచయం చేసింది. ఇలా చైనాలోని అన్ని ప్రావిన్సుల్లో, నగరాల్లో స్పెర్మ్ బ్యాంకులు ఇలాగే ప్రకటనలు ఇస్తున్నాయి.
Read Also: Amit Shah: కాంగ్రెస్, జేడీయూ టిప్పు సుల్తాన్‌ను నమ్ముకుంటున్నాయి.. బీజేపీ మాత్రం..
2022లో చైనా జనాభాత తగ్గుదల నమోదు చేసింది. ఆరు దశాబ్ధాల కాలంలో తొలిసారిగా జనాభా వృద్ధిలో క్షీణత చోటు చేసుకుంది. చైనా మెయిన్ ల్యాండ్ లో 2016లో నవజాత శిశువుల సంఖ్య 18.83 మిలియన్లు ఉండగా.. 2017 నుంచి వరసగా ఐదేళ్లుగా ఈ సంఖ్య పడిపోతోంది. జనాభా తగ్గిపోతుండటంతో దశాబ్ధాలుగా చైనాలో ఉన్న ఒక బిడ్డ విధానాన్ని 2015లో అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం రద్దు చేసింది. అన్ని జంటలు ఇద్దరు పిల్లల్ని కలిగి ఉండవచ్చని తెలిపింది. 2021లో మూడో బిడ్డను కనేందుకు కూడా అనుమతి ఇచ్చింది. అయితే అక్కడి ప్రభుత్వం అనుకున్నంతగా ఇది ప్రభావం చూపడం లేదు.
దీంతో అక్కడి స్పెర్మ్ బ్యాంకులు వీర్యం దానం చేయాల్సిందిగా యూనివర్సిటీ విద్యార్థులను కోరుతున్నాయి. కొన్ని స్పెర్మ్ బ్యాంకులు 20-40 ఏళ్ల మధ్య ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలని, అంటు వ్యాధులు ఉండవద్దని, బట్టతల, పొగతాగే అలవాటు, మధ్యసేవించే అలవాటు, బీపీ ఉన్న వారు వీర్యాన్ని దానం చేయడానికి అనర్హులుగా అక్కడి స్మెర్మ్ బ్యాంకులు కండీషన్లు విధిస్తున్నాయి.