Turkey Earthquake: టర్కీ దేశం భూకంపం వల్ల తీవ్రంగా దెబ్బతింది. టర్కీలోని దక్షిణ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాల ధాటికి పెద్ద ఎత్తున భవనాలు, ఇళ్లు కూలిపోయాయి. టర్కీతో పాటు సిరియా కూడా దెబ్బతింది. ఇప్పటికే ఈ రెండు దేశాల్లో మరణాల సంఖ్య 24 వేలను దాటింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. తీవ్రంగా నష్టపోయిన టర్కీకి ప్రపంచదేశాల నుంచి ఆపన్నహస్తం అందుతోంది. భారత్ ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో రెస్క్యూ ఆపరేషన్, వైద్య సహాయం అందిస్తోంది.…
Pakistan: పాకిస్తాన్ దేశంతో దైవదూషణ కేసుల్లో హత్యలు చేయడం పరిపాటిగా మారింది. గతంలో ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో మేనేజర్ గా పనిచేస్తున్న శ్రీలంక జాతీయుడిని దైవదూషణ చేశాడని ఆరోపిస్తూ కొట్టి చంపారు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. దైవదూషణ చేశాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ లో ఉన్న వ్యక్తిని బయటకు ఈడ్చుకొచ్చి, పోలీసుల ముందే ప్రజలు కొట్టి చంపారు. పోలీసులు ఉన్న ఏం చేయలేకపోయారు.
Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం కర్ణాటకలో పర్యటించారు. దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరులో సెంట్రల్ అరెకానట్ మరియు కోకో మార్కెటింగ్ మరియు ప్రాసెసింగ్ కో-ఆపరేటివ్ లిమిటెడ్ (క్యాంప్కో) స్వర్ణోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, జేడీయూపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. 18వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్‌ను కాంగ్రెస్, జేడీ(ఎస్)లు విశ్వసించాయని,
All about lithium, could change India's fate: జమ్మూ కాశ్మీర్ రియాసి జిల్లాలో చాలా విలువైన లిథియం ఖనిజం భారీ నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఏకంగా 60 లక్షల టన్నుల ఖనిజం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ లిథియం భారతదేశ భవితను మార్చబోతుందా..? అంటే ఔననే సమాధానం వస్తుంది. కాస్మిక్ మెటల్ గా పేరొందిన లిథియంకు ప్రస్తుతం మార్కెట్ లో భారీగా డిమాండ్ ఉంది. రాబోయే కాలం ఎలక్ట్రానిక్స్, ఈవీ రంగంలో లిథియం బ్యాటరీల వినియోగం పెరగనుంది.…
Zomato: పుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫామ్ జొమాటో తన మూడో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. కంపెనీ ఆదాయం 75 శాతం పెరిగింది. గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో రూ. 1,112 కోట్లు కాగా.. ఈ ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో రూ.1,948 కోట్లు ఆదాయం వచ్చింది. అయితే నష్టాలు మాత్రం 450 శాతం పెరిగాయి. గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో రూ. 63 కోట్లు ఉండగా.. ఈ ఏడాది రూ.345 కోట్ల నష్టాలు చవిచూసింది. మునుపటి క్వాటర్లీ ఫలితాలతో పోల్చుకుంటే వినియోగదారుల లావాదేవీలు పడిపోయాయి.
Turkey Earthquake: టర్కీ-సిరియా భూకంపం ఈ రెండు దేశాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇప్పటికే రెండు దేశాల్లో కలిపి 25,000 మంది మరణించారు. శిథిలాలు తొలిగే కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతోంది. సోమవారం టర్కీలో 7.8, 7.5 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. 1000 కన్నా ఎక్కవసార్లు భూమి కంపించింది. ఈ ప్రభావం వల్ల టర్కీ దక్షిణ ప్రాంతం, సిరియా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే భూకంపం తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. ఏకంగా 300 కిలోమీటర్ల పొడవుతో భూమి పగుళ్లకు దారి తీసింది. శాటిలైట్ చిత్రాల్లో…
Curiosity Rover Makes A Stunning New Discovery: సౌరవ్యవస్థలో భూమి తరువాత మానవుడు నివసించే అవకాశాల ఉన్న గ్రహంగా అంగారకుడిని భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడ పరిశోధనలు చేయడానికి నాసాతో పాటు మరికొన్ని దేశాల స్పేస్ ఏజెన్సీలు అరుణగ్రహంపై రోవర్లను పంపించాయి. వీటిలో గ్రహ ఉపరితలం, నీటి ఆనవాళ్ల గురించి పరిశోధనలు జరుపుతున్నాయి. ఇప్పటికే పలు అధ్యయనాలు మార్స్ పై ఒకప్పుడు విస్తారంగా నీరు ఉండేదని తేలింది. అయితే తాజాగా నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ మరో అద్భుత ఆవిష్కరణ చేసింది. ఒకప్పుడు అంగారకుడిపై…
GoDaddy layoff: లేఆఫ్స్ జాబితాలో మరో కంపెనీ కూడా చేరిపోయింది. ప్రముఖ వెబ్ హోస్టింగ్ ప్లాట్ ప్లాట్‌ఫారమ్ గోడాడీ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. తన సిబ్బందిలో 8 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గోడాడీ సీఈఓ అమన్ భూటానీ మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్థిక పరిణామాల వల్లే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. సిబ్బందికి పంపిన ఈమెయిల్స్ లో ఈ ఉద్యోగులు తొలగింపుకు కారణాలు వెల్లడించారు.
Earthquake: గుజరాత్ లోని సూరత్ నగరంలో శనివారం తెల్లవారుజామున భూమి కంపించిందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (ఐఎస్ఆర్) వెల్లడించింది. సూరత్ కు పశ్చిమనైరుతికి 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. 3.8 తీవ్రతతో భూకంపం వచ్చిందని దీనివల్ల సూరత్ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది. భూకంప కేంద్రం సూరత్ జిల్లా హజీరా ప్రాంతంలోని అరేబియా సముద్రంలో 5.2 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ ప్రకంపనల వల్ల ఆస్తినష్టం, ప్రాణ నష్టం సంభవించలేదు.
Jamiat Ulama-i-Hind: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లాగే భారతదేశం తమకు చెందినది అని జమియత్-ఉలమా-ఇ-హింద్ అధ్యక్షుడు మహమూద్ మదానీ అన్నారు. ఢిల్లీలో ప్రారంభమైన జమియత్ ఉలామా-ఇ-హింద్ ప్రారంభోత్సవ ప్లీనరీ సమావేశంలో మౌలానా మదానీ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ, భగవత్ లకు ఈ దేశంపై ఎంత హక్కు ఉందో మహమూద్ మదానీకి కూడా అంతే హక్కు ఉందని అన్నారు. వారి కన్నా తాను దేశం కోసం ఒక్క అంగుళం ముందే ఉంటానని వెల్లడించారు.