Elon Musk Old video Goes Viral: ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు ఎలాన్ మస్క్. టెస్లా, స్పేస్ ఎక్స్ తో పాటు ఇటీవల ట్విట్టర్ ను కూడా సొంతం చేసుకున్నారు. తను ఏ రంగంలో అడుగుపెట్టినా సక్సెస్ అవ్వాల్సిందే. అంతలా వ్యాపార సామ్రాజ్యంలో మస్క్ దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే ఎలాన్ మస్క్ దాదాపుగా 25 ఏళ్ల క్రితం ఇంటర్నెట్ గురించి చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఏలుతుందని ఆయన అన్నారు. సరిగ్గా 25 ఏళ్ల తరువాత ఆయన చెప్పిన మాటలే నిజం అయ్యాయి.
Read Also: MLA Sayanna : బీఆర్‌ఎస్‌లో విషాదం.. ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత
టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ 1998లో సీబీఎస్ సండే మార్నింగ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్ ఇంటర్నెట్ ప్రభావం గురించి చెప్పారు. ఇంటర్నెట్ అన్ని మీడియాను మించిపోతుంది, అన్ని రకాల మీడియాలు అంతరించిపోతాయి. ఫ్రింట్, టీవీ, రేడియో ఇలా అన్ని మీడియాలు ఇంటర్నెట్ లో రావడాన్ని చూడవచ్చు అని ఆయన అన్నారు. ఇంటర్నెట్ లో వినయోగదారులు చూడాలనుకున్నది చూడవచ్చు అని.. ఇది అన్ని సాంప్రదాయ మీడియాలను మారుస్తుందని భావిస్తున్నానని ఆయన అన్నారు.
ఎలాన్ మస్క్ పాత వీడియోను షేర్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. ఇప్పటికే 20 లక్షల మంది ఈ వీడియోను చూశారు. 17,000 మంది కంటే ఎక్కవ లైక్స్ కొట్టారు. ఎలాన్ మస్క్ దూరదృష్టి కలవాడని.. 25 ఏళ్లక్రితం చెప్పిన మాటలు నిజం అవుతున్నాయంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో గురించి ఎలాన్ మస్క్ స్పందించారు.. ‘‘ఓహ్ చాలాకాలం, అది ఎప్పుడు..?’’ అని ట్విట్ చేశారు. దీనికి టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ బదులిస్తూ క్లిప్ 1998లో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలోనిది అని చెప్పారు.
.@elonmusk explains the internet back in the day. pic.twitter.com/h6wxGkzrSG
— Tesla Owners Silicon Valley (@teslaownersSV) February 17, 2023