Bengaluru: బెంగళూర్ నగరంలో అక్రమంగా 600 మంది విదేశీయులు తిష్ట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: బెంగళూర్ నగరంలో వీసా గడువు ముగిసినప్పటికీ 600 మందికి పైగా విదేశీయులు తిష్ట వేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరందరినీ వారి దేశాలకు వాపసు పంపేందుకు హోంశాఖ కసరత్తు చేస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన యువతిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడు వివాహమాడి బెంగళూరులో కాపురం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చాక నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పాక్ యువతిని స్వదేశానికి తిప్పి పంపిన తరహాలోనే నగరంలో తిష్టవేసిన ఆఫ్రికా దేశాలకు చెందిన వారిని కూడా వాపసు పంపే ప్రయత్నాలు చేపట్టినట్టు నగర పోలీసు యంత్రాంగం వెల్లడించింది. బెంగళూరులో అక్రమంగా తిష్ట వేసిన 400 మందికి పైగా విదేశీయులపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని వీరిలో కొందరు జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా మరికొందరు బెయిల్‌పై బయటకు వచ్చారని పోలీసు వర్గాలు అంటున్నాయి.
బెంగళూరులో అక్రమంగా తిష్టవేసిన విదేశీయుల్లో ఇంతవరకు 34 మందిని గుర్తించి వారి దేశాలకు తిప్పి పంపారు. వీరిలో ఆఫ్రికా, నైజీరియా, బంగ్లాదేశ్ వాసులు ఉన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మరో 50 మందిని అదుపులోకి తీసుకుని బెంగళూరు నగర శివారులోని నెలమంగల సొండేకొప్ప డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు. ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు సమాచారం అందించారు. అటువైపు నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే మరో నెలరోజుల్లో వీరిని కూడా తిప్పి పంపాలని భావిస్తున్నారు.
Also Read
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
Read Also: Petrol Rates: హెచ్చుతగ్గుల్లో పెట్రో ధరలు.. రానున్న రోజుల్లో మంటలే
రాజధాని నగరంలోని తూర్పు ప్రాంతాలైన బాణసవాడి, రామమూర్తినగర్, హెణ్ణూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఆఫ్రికా దేశాలకు చెందినవారు పెద్దసంఖ్యలో నివసిస్తున్నారు. వీరిలో 40 మంది వీసా గడువు ముగిసినా కూడా తిష్ట వేసినట్టు గుర్తించిన ఈశాన్య విభాగం పోలీసులు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. రెండో విడత తనిఖీలు చేపట్టాల్సిందిగా నగర పోలీసులకు హోంశాఖ నుంచి సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది.
నెలమంగలలోని సొండేకొప్ప డిటెన్షన్ సెంటర్‌లో కేవలం 50 మందిని మాత్రమే ఉంచేందుకు అవకాశం ఉంది. అక్రమంగా తిష్ట వేసిన విదేశీ మహిళలను తుమకూరులో ఉంచేందుకు వీలుగా అక్కడ ఒక డిటెన్షన్ కేంద్రం, బెంగళూరు నగరంలో మరో డిటెన్షన్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర హోంశాఖ విదేశీయుల రిజిస్ట్రేషన్ ప్రాంతీయ కార్యాలయం (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) అధికారులను కోరినట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు.
వీసా గడువు ముగిసినప్పటికీ నగరంలో తిష్ట వేసిన విదేశీయులను ఒక్కసారిగా విదేశాలకు పంపడం సాధ్యం కాదని ఇదొక సుదీర్ఘ ప్రక్రియ అని జాయింట్ పోలీస్ కమిషనర్ శరణప్ప అంటున్నారు. వీసా అవధి ముగిసిన విదేశీయుల కదలికలపై డేగకన్ను వేసి ఉంచామన్నారు. ప్రత్యేకించి ఇలా అక్రమంగా నివసిస్తున్నవారిలో కొందరు మాదక ద్రవ్యాల వ్యవహారం, వ్యభిచార కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నట్టు తేలిందన్నారు. విదేశీయులను తిప్పి పంపేందుకు తొలుత ఆ దేశ రాయబార కార్యాలయాలతో చర్చించాల్సి ఉంటుందని, ఈలోపు వారిపై మనదేశంలో దాఖలైన క్రిమినల్ కేసులు క్లియర్ కావాల్సి ఉంటుందని శరణప్ప వివరించారు. పైగా అక్రమంగా తిష్ట వేసిన విదేశీయులను తిరిగి స్వీకరించేందుకు ఆయా దేశాలు అంగీకరించాల్సి ఉంటుందని, వారి ప్రయాణ ఖర్చులు భరించాల్సి ఉంటుందని వివరించారు. ఈ ప్రధాన కారణాల వల్లనే విదేశీయులు అక్రమంగా తిష్ట వేసినా వారిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేకపోతున్నామన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!