Man lost in Amazon jungle for 31 days: ప్రపంచంలోనే అతిపెద్ద దట్టమైన అడవి అమెజాన్. దక్షిణ అమెరికా ఖండంలో బ్రెజిల్ పాటు చుట్టుపక్కల దేశాల్లో విస్తరించి ఉన్న మహారణ్యం. ఇక్కడ తప్పిపోవడం అంటే చావుతో సమానమే. ఎటువెళ్లాలో తెలియదు, ఎటుచూసినా కనుచూపు మేరలో చెట్లు తప్పితే ఇంకేం కనిపించవు. ప్రపంచంలోనే అతిపెద్ద అనకొండలు, చిరుతపులులు, మొసళ్లకు, విష కీటకాలకు అమెజాన్ అడవి ప్రసిద్ధి. ఇలాంటి సమయంలో వాటి నుంచి తప్పించుకుని బతికిబట్టకట్టడం అంటే అదృష్టమని చెప్పవచ్చు.
Read Also: Gas Protest : గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా
బోనటన్ అకోస్టా అనే వ్యక్తికి మాత్రం ఇంకా భూమిపై నూకలు ఉన్నాయి. అమెజాన్ అడవిలో తప్పిపోయి 31 రోజుల తర్వాత రక్షించబడ్డాడు. బొలీవియాకు చెందిన అకోస్టా తాను ఎలా బతికాననే విషయాలను వెల్లడించారు. అకోటస్టా(30) తన స్నేహితులతో కలిసి జనవరి 25న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో వేటకు వెళ్లాడు. అయితే తన స్నేహితుల నుంచి విడిపోయిన అతను ఏకంగా 31 రోజలు పాటు మనుగడ పోరాటం సాగించాడు.
బతికేందుకు తనమూత్రం తానే తాగి, కీటకాలను తింటూ జీవనం సాగించాడు. తన సోదరుడు ఓ అడవి పందితో పోరాడాల్సి వచ్చిందని, పులి నుంచి తప్పించుకున్నట్లు అకోస్టా సోదరి వెల్లడించారు. వర్షం సమయంలో తన రబ్బరు ట్యూబులో నీరు నింపుకుని తాగేవాడు. వర్షాలు లేని సమయంలో తన మూత్రాన్ని తానే తాగేవాడు. జనవరి నెల చివర్లో బోనటన్ అకోస్టా తప్పిపోయాడని చెప్పడంతో రెస్య్కూ టీం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. 31 రోజుల తర్వాత గత శనివారం ఆయన్ను గుర్తించారు. నెల రోజుల్లో 17 కిలోల బరువు తగ్గడంతో పాటు డీహైడ్రేషన్ తో బాధపడుతున్నాడు బొనటన్ అకోస్టా. తిరిగి తనవారిని కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని అకోస్టా చెబుతున్నాడు.