India On Pakistan: పాకిస్తాన్ మరోసారి కాశ్మీర్ రాగం ఎత్తుకుంది. వేదిక ఏదైనా, ఎజెండా ఏమైనా అవేవీ పట్టించుకోకుండా అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, భారత్ ను అబాసుపాటు చేయాలని భావిస్తోంది. తాజాగా బహ్రెయిన్ లో సోమవారం 146వ ఇంటరం పార్లమెంటరీ యూనియన్(ఐపీయూ) అసెంబ్లీ సోమవారం భారత్, పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీయూలో కూడా పాక్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో భారత్ విరుచుకుపడింది. పాకిస్తాన్ ను ‘‘ఉగ్రవాద ఎగుమతిదారు’’ విమర్శించింది.
Pre-Installed Apps: స్మార్ట్ ఫోన్ల విషయంలో కేంద్రం కీలక చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. స్మార్ట్ ఫోన్లలో ముందగానే ఇన్ బిల్ట్ గా ఉంటున్న ప్రీ ఇన్స్టాల్ యాప్‌లపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. భద్రతా పరంగా సమస్యలు తలెత్తె అవకాశం ఉండటంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గూఢచర్యం, యూజర్ డేటా దుర్వినియోగం గురించి ఆందోళన నేపథ్యంలో ఐటీ మంత్రిత్వ శాఖ ఈ కొత్త నిబంధనలను పరిశీలిస్తోంది.
Topless At Public Swimming: లింగవివక్షతను రూపుమాపేందుకు జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలోని అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు కూడా టాప్‌లెస్‌గా పబ్లిక్ స్విమ్మింగ్ ఫూల్స్ లోని ప్రవేశించడాన్ని అనుమతించింది. దీంతో ఇకపై మగవారు, ఆడవారు టాప్‌లెస్‌గా స్విమ్మింగ్ ఫూల్స్ లో ఈత కొట్టవచ్చన్నమాట. మహిళ వివక్షపై ఓ మహిళ ఫిర్యాదు ఇవ్వడంలో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Man Chops Woman Body in jammu kashmir: ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య తరహాలోనే మరో హత్య జరిగింది. మహిళను చంపి ముక్కలుగా చేసి పాతేశాడు. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ బుద్గామ్ లో జరిగింది. పోలీస్ విచారణలో భయానక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే బుద్గామ్ సోయిబుగ్ కు చెందిన తన్వీర్ అహ్మద్ ఖాన్ మార్చి 8 నుంచి తన సోదరి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్చి 7న కోచింగ్ క్లాసెస్ కు వెళ్తున్నా…
Tyre Burst Not Act Of God: కారు ప్రమాదంలో మరణించిన వ్యక్తికి ఇన్సూరెన్స్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వేసిన పటిషన్ ను బాంబే హైకోర్ట్ కోట్టేసింది. బాధిత కుటుంబానికి డబ్బు చెల్లించాల్సిందే అని తీర్పు చెప్పింది. టైర్ పగిలిపోవడం ‘‘యాక్ట్ ఆఫ్ గాడ్’’ కాదని స్పష్టం చేసింది. ఈ కేసులో చనిపోయిన వ్యక్తిపైనే కుటుంబం ఆధారపడి ఉందని పేర్కొంది. బాధిత కుటుంబానికి రూ. 1.25 కోట్లను చెల్లించాలని న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ను ఆదేశించింది.
Physical abuse of Polish woman: ముంబైకి చెందిన ఓ వ్యక్తి తన సహోద్యోగి పోలాండ్ దేశానికి చెందిన యువతిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బ్లాక్ మెయిల్ చేస్తూ గత ఆరేళ్లుగా వేధింపులకు గురిచేస్తున్నాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే పోలాండ్ దేశానికి చెందిన యువతి ముంబైలో ఉద్యోగం నిమిత్తం నివసిస్తోంది. అయితే అదే కంపెనీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా పనిచేసే మనీష్ గాంధీ అనే వ్యక్తి ఆమెను లైంగికంగా వేధించడం ప్రారంభించారు.
BBC: బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి 2002 గుజరాత్ అల్లర్లలో లింకు పెడుతూ ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై భారత్ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా మరో రెండు వివాదాల్లో చిక్కుకుంది. ప్రముఖ పర్యావరణవేత్త సర్ డేవిడ్ అటెన్ బరో వ్యాఖ్యానంతో కొనసాగే వన్యప్రాణులపై సీరీస్ ఎపిసోడ్ ను నిలివేశారని ఆరోపణ ఎదుర్కొంటోంది. ప్రముఖ ఫుడ్ బాల్ క్రీడాకారుడు, బీబీసీ స్పోర్ట్స్ యాంకర్ గ్యారీ లెనకను తప్పించడం మరోటి. ఈ రెండింటితో బీబీసీ అసాబుపాలు…
Anand Mahindra: ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహీంద్రా సంస్థల చైర్మన్ గా బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎన్నో ఆసక్తికరమైన ట్వీట్లు చేస్తూ నెటిజన్లకు అందుబాటులో ఉంటారు. ఇన్స్పిరేషనల్, మోటివేషనల్, ఫన్నీ ట్వీట్లు చేస్తుంటారు. నెటిజెన్లు చేసే పలు ట్వీట్లకు కూడా స్పందిస్తుంటారు. అందుకే ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ హ్యాండిల్ కు 10.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
PM To Open Karnataka Expressway: మరికొన్ని రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి అక్కడి అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ పెద్దలతో పాటు ప్రధాని నరేంద్రమోదీ వరసగా కర్ణాటకకు వెళ్తున్నారు. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలోనే ప్రధాని ఆరుసార్లు కర్ణాటకకు వెళ్లారు.
Covid-19: మూడేళ్లుగా కోవిడ్ వ్యాధి ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. దీని ఎఫెక్ట్ వల్ల పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్షల్లో మరణాలు సంభవించాయి. ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ కొత్త అధ్యయనంలో ఎలుకలు కూడా కరోనా వైరస్ సోకవచ్చని తేలింది. అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ యొక్క ఓపెన్-యాక్సెస్ జర్నల్ ఎంబయోలో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.