Vote From Home: ఇకపై కొన్ని వర్గాల ప్రజలు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించబోతోంది భారత ఎన్నికల సంఘం. 80 ఏళ్లకు పైబడిని వారు ఇకపై ఇంటి నుంచే ఓటేసే విధంగా నిర్ణయం తీసుకుంది. ఈ పద్ధతిని తొలిసారిగా కర్ణాటక ఎన్నికల్లో తీసుకురాబోతున్నారు. మరికొన్ని రోజుల్లో కర్ణాటక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో 80 ఏళ్లకు పైబడిన వారు, వికలాంగులకు ఇంటి నుంచే ఓటేసే సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. తమ ఎన్నికల బృందాలు ఫారం-12డిలో ఓటర్…
Most Canadians Believe China is a Threat: డ్రాగన్ కంట్రీ చైనాను ప్రపంచదేశాలు ముప్పుగా భావిస్తున్నాయి. కరోనా వైరస్ , చైనా దుందుడుకు వైఖరి, ఇతర దేశాలపై నిఘా, ఇతర దేశాల ఎన్నికలను ప్రభావితం చేస్తోంది చైనా. దీంతో చైనాతో ఎప్పటికైనా ప్రమాదం ఉంటుందని పలు దేశాలు భావిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కెనడా కూడా చేరింది. ఇటీవల నిర్వహించిన ఓ పోల్ లో కెనడా ప్రజలు చైనాతో ముప్పు ఉందని భావిస్తున్నారు. ఇదే సమయంలో భారత్ తో సన్నిహిత సంబంధాలను కోరుకోవడం…
Gujarat passes resolution On BBC Documentary on Modi: బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్(బీబీసీ) ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన డాక్యుమెంటరీ ‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’ దేశంలో తీవ్ర దుమారాన్ని రేపింది. ఇటు భారత్ లోనూ.. అటు బ్రిటన్ లోనూ ఈ డాక్యుమెంటరీపై విమర్శలు రావడంతో పాటు పలువురు సమర్థించారు. భారత దేశం ఏకంగా దీన్ని ‘వలసవాద మనస్తత్వం’గా అభివర్ణించింది. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అప్పటి రాష్ట్ర సీఎంగా ఉన్న నరేంద్రమోదీ ప్రమేయం ఉందని డాక్యుమెంటరీలో ఆరోపించారు.
Indonesia's Merapi Volcano Erupts: ఇండోనేషియాలో మెరాపి అగ్నిపర్వతం శనివారం బద్దలైంది. దీని ప్రభావంతో ఏడు కిలోమీటర్ల మేర ధూళి మేఘాలు కమ్ముకున్నాయని ఆ దేశా వివత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇండోనేషియాలోని యొగ్యకర్తా ప్రాంతంలో ఉన్న మెరాపి అగ్నిపర్వతం స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు విస్పోటనం చెందింది. 1.5 కిలోమీటర్ల మేర లావా ప్రవాహాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అగ్నిపర్వతం నుంచి మూడు నుంచి 7 కిలోమీటర్ల పరిధిలోని ప్రజల కార్యకలాపాలు నిలిపివేయాలని ప్రభుత్వం హెచ్చరించింది.
Li Qiang elected China’s new premier: మూడోసారి చైనా అధ్యక్షుడిగా షి జిన్ పింగ్ మరోసారి అధ్యక్ష బాధ్యతలను తీసుకున్నారు. శుక్రవారం ఆయన మరోసారి అత్యున్నత పదవిని అధిష్టించారు. తాజాగా శనివారం చైనా కొత్త ప్రధానిగా లీ కియాంగ్ ఎన్నికయ్యారు. చైనా నేషనల్ పీపుల్ కాంగ్రెస్ శనివారం లీ కియాంగ్ ను ప్రధానిగా నామినేట్ చేసింది. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాకు నామమాత్రం అధికారాలు కలిగిన ప్రధానిగా లీ కియాంగ్ ఉండనున్నారు. 69 ఏళ్ల కియాంగ్ చైనా అధ్యక్షుడు షి…
Iran-Saudi Arabia: అరబ్ ప్రపంచంలోనే బద్ధ శత్రువులుగా ఉన్న ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య మళ్లీ సంబంధాలు మొదలువుతున్నాయి. గత కొన్ని దశాబ్ధాలుగా ఇరు దేశాల మధ్య తీవ్రమైన వైరం ఉంది. అయితే తాజాగా చైనా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కూడా దౌత్య సంబంధాలు పెట్టుకునేందుకు సిద్ధం అయ్యాయి. ఇరు దేశాలు కూడా రెండు దేశాల్లో తమ రాయబార కార్యాలయాలు తెరిసేందుకు అంగీకరించాయి. మిడిల్ ఈస్ట్ లో యెమెన్, సిరియా వంటి దేశాల్లో ఘర్షణలకు, భద్రతా ముప్పుకు కారణం అయ్యాయి ఈ రెండు దేశాలు.…
Family suicide to escape alcoholic husband: మద్యం వల్ల దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మద్యం కారణంగా ఏకంగా ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. తాగుబోతు భర్త నుంచి తప్పించుకునేందుకు భార్య, కొడుకు, కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నార్సింగ్ పూర్ లో జరిగింది.
Bilawal Bhutto Zardari: జమ్మూ కాశ్మీర అంశాన్ని పాకిస్తాన్ పలు వేదికలపై ప్రస్తావిస్తోంది. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి సాధారణ, భద్రత మండలిలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు పాక్ ప్రతినిధులు. ముఖ్యంగా పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్ధానీ జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ ను విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోసారి బిలావల్ భుట్టో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. తాను కాశ్మీర్ అంశాన్ని ముఖ్యమైన ఎజెండాగా చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఎజెండాతో సంబంధం లేకుండా ప్రతీ ఐక్యరాజ్యసమితి సమావేశంలో కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తుతోంది.
Artemis-2: దాదాపుగా 50 ఏళ్ల క్రితం మానవుడు చంద్రుడిపైకి వెళ్లాడు. ఆ తరువాత ఏ అంతరిక్ష సంస్థ కూడా చంద్రుడి పైకి వెళ్లేందుకు సాహసించలేదు. ఎందుకంటే అంతటి క్లిష్టతతో కూడిన అంతరిక్ష ప్రయాణం కాబట్టే నాసాతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, రష్యా అంతరిక్ష సంస్థలు చంద్రుడిని పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే నాసా మాత్రం 2024లో ఆర్టెమిస్ -2 ద్వారా మానవుడిని మరోసారి చంద్రుడిపైకి పంపాలని ప్రణాళిక సిద్ధం చేసింది. నలుగురు వ్యోమగాములను చంద్రుడి పైకి పంపనుంది.
Meta: ట్విట్టర్ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు తమ అభిప్రాయాలను చెప్పేందుకు వేదికగా నిలిచింది. ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ భారీ డీల్ తో ట్విట్టర్ ను సొంతం చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ట్విట్టర్ కు పోటీగా కొత్త యాప్ ను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా. ట్విట్టర్ ప్లేస్ ను ఆక్రమించేందుకు, దానికి పోటీగా నిలిచేందుకు కొత్త సోషల్ మీడియా యాప్ తీసుకువచ్చే ఆలోచనలో మెటా ఉన్నట్లు తెలుస్తోంది.