India On Pakistan: పాకిస్తాన్ మరోసారి కాశ్మీర్ రాగం ఎత్తుకుంది. వేదిక ఏదైనా, ఎజెండా ఏమైనా అవేవీ పట్టించుకోకుండా అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, భారత్ ను అబాసుపాటు చేయాలని భావిస్తోంది. తాజాగా బహ్రెయిన్ లో సోమవారం 146వ ఇంటరం పార్లమెంటరీ యూనియన్(ఐపీయూ) అసెంబ్లీ సోమవారం భారత్, పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీయూలో కూడా పాక్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో భారత్ విరుచుకుపడింది. పాకిస్తాన్ ను ‘‘ఉగ్రవాద ఎగుమతిదారు’’ విమర్శించింది.
Read Also: Puvvada Ajay Kumar: నీ పప్పులు కేసీఆర్ ముందు ఉడకవు.. పొంగులేటి పై పువ్వాడ అజయ్ విసుర్లు..
జమ్మూ కాశ్మీర్, లఢాఖ్ ప్రాంతం భారత్ లో అంతర్భాగం అని మరోసారి స్పష్టం చేసింది. పాకిస్తాన్ కు దీంతో ఏం సంబంధం లేదని తెలిపింది. రాజ్యసభ ఎంపీ సస్మిత్ పాత్ర మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ గురించి పాక్ ప్రస్తావించడం, వేదికను దుర్వినియోగపరచడమే అని ఆయన అన్నారు. ఇది ఆమోదయోగ్యం కాదని తెలిపారు. కాశ్మీర్ పై మాట్లాడటానికి పాకిస్తాన్ కు ఎలాంటి అధికారం లేదని, ఇది భారత అంతర్గతం అంశం అని తెలిపారు. టెర్రరిస్టుల ఎగుమతిదారు, సీమాంతర ఉగ్రవాదాన్ని పోషించే దేశం జమ్మూ కాశ్మీర్, మానవ హక్కుల ఉల్లంఘనపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.
గతంలో యూఎన్ వేదికపై కూడా జమ్మూకాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తే ప్రయత్నం చేసింది. దీకి ఒక్క టర్కీ మద్దతు తెలిపింది తప్పితే ఏ ఇతర దేశం కూడా కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించలేదు. ఇటీవల పాక్ విదేశాంగ మంత్రి భిలావల్ భుట్టో జర్దారీ తాము అన్ని వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తామని, అయితే తమకు ఇతర దేశాల నుంచి మద్దతు రావడం లేదని అన్నారు.