Physical abuse of Polish woman: ముంబైకి చెందిన ఓ వ్యక్తి తన సహోద్యోగి పోలాండ్ దేశానికి చెందిన యువతిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బ్లాక్ మెయిల్ చేస్తూ గత ఆరేళ్లుగా వేధింపులకు గురిచేస్తున్నాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే పోలాండ్ దేశానికి చెందిన యువతి ముంబైలో ఉద్యోగం నిమిత్తం నివసిస్తోంది. అయితే అదే కంపెనీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా పనిచేసే మనీష్ గాంధీ అనే వ్యక్తి ఆమెను లైంగికంగా వేధించడం ప్రారంభించారు.
Read Also: AP Budget Session: ఏపీ బడ్జెట్ 2.6 లక్షల కోట్లు.. కేటాయింపులు భారీగా ఉంటాయా?
గత 6 ఏళ్లుగా సదరు యువతిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అంతే కాకుండా యువతికి సంబంధించిన అసభ్యకరమైన ఫోటోలను పంపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఆమె ప్రైవేట్ వీడియోలు ఆమెకు తెలియకుండా చిత్రీకరించి వాటిని బంధువులకు, ఇతర ఉద్యోగులకు లీక్ చేస్తానని బెదిరించాడు. నిందితుడు మనీష్ గాంధీ పనిచేస్తున్న కంపెనీలోనే 2016లో బాధిత మహిళ చేరింది. ప్రస్తుతం మనీష్ పరారీలో ఉన్నాడు. 2016 నుంచి ఆరేళ్లకాలంలో పోలాండ్ మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మనీష్ నత ప్రైవేట్ వీడియోలను పంపిన తర్వాత తనపై వేధింపులు ప్రారంభం అయ్యాయని మహిళ ఆరోపించింది.
ఆ తరువాత కంపెనీ పనినిమిత్తం ఇద్దరూ జర్మనీ, భారత్ లోని వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు నిందితుడు, తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. మనీష్ పై లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ముంబైలోని అంబోలీ పోలీస్ స్టేషన్ నిందితుడు మనీష్ గాంధీ కోసం వెతుకుతున్నారు.