బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. గత వారం స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈ వారం కూడా తగ్గుతాయేమోనని అనుకున్నారు. కానీ మగువలకు ధరలు షాకిచ్చాయి. మరోసారి భారీగా గోల్డ్, సిల్వర్ ధరలు పెరిగిపోయాయి. దీంతో కొనాలంటేనే కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.1,100 పెరగగా.. వెండిపై రూ.5,000 పెరిగింది.
ఇది కూడా చదవండి: Asim Munir: ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆ అనుభూతి పొందాం.. అసిమ్ మునీర్ వ్యాఖ్య
బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,100 పెరిగి.. రూ.1,35,280 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 1,000 పెరిగి రూ.1,24,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.820 పెరిగి రూ.1,01,460 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్ నుంచి ట్రంప్ ఫొటోలు తొలగింపు! సమర్థించిన టాడ్ బ్లాంచే
ఇక సిల్వర్ ధర భారీ షాకిచ్చింది. ఈరోజు కిలో వెండిపై రూ.5,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,19, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నై బులియన్ మార్కెట్‌లో మాత్రం రూ.2,31,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,19, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.