Donald Trump: అమెరికాలో వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ నేత డొనాల్డ్ ట్రంప్ పోటీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇప్పటికే రిపబ్లిక్ పార్టీ నుంచి ఆయన జూనియర్ నిక్కీ హేలి ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో కీలక వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్దం ఆపేసత్తా నాకే ఉందని ఆయన అన్నారు. అధ్యక్షుడు జో బైడెన్ రష్యాను చైనా చేతుల్లో పెట్టారని విమర్శించారు.
Umesh Pal Case: ఉత్తర్ ప్రదేశ్ లో ఉమేష్ పాల్ హత్య కేసులో ఎన్ కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఒక నిందితుడు ఎన్ కౌంటర్ లో చనిపోగా.. తాజాగా మరో నిందితుడు విజయ్ చౌదరి అలియాస్ ఉస్మాన్ ఎన్ కౌంటర్లో హతం అయ్యాడు. ఈ ఎన్కౌంటర్లో విజయ్ చౌదరి అలియాస్ ఉస్మాన్ మెడ, ఛాతీ, తొడపై బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.కౌంధియారా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోతి, బెల్వా మధ్య ఉదయం 5.30 గంటలకు ఎన్కౌంటర్ జరిగిందని ధూమంగంజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్…
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కొందరు రష్యా సైనికులు చేసిన అకృత్యాలు, అఘాయిత్యాలు బయటకు వస్తున్నాయి. గతేడాది ఇద్దరు రష్యన్ సైనికులు నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని, చిన్నారి తల్లికి తుపాకీ గురిపెట్టి, భర్త ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఉక్రెయిన్ ఆరోపించింది. ఉక్రెయిన్ ప్రాసిక్యూషన్ ఫైల్స్ ప్రకారం 2022 మార్చినెలలో రాజధాని కీవ్ కు సమీపంలో బ్రోవరీ జిల్లాల్లో 4 ఇళ్లల్లోకి చొరబడి రష్యా 15వ స్పెషల్ మోటరైజ్డ్ రైఫిల్ బ్రిగేడ్ కు చెందిన రష్యన్ సైనికులు లైంగిక నేరాలకు పాల్పడినట్లు…
Pakistan: ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ మరిన్ని కష్టాలను ఎదుర్కొంటోంది. ఇటీవల ట్రాన్స్మిషన్ లైన్ ఫెయిల్యూర్ కారణంగా పాక్ రాజధానితో పాటు ప్రధాన నగరాలు, ఇతర ప్రాంతాల్లో ఒక రోజు పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తాజాగా మరోసారి పాక్ విద్యుత్ వ్యవస్థ వైఫల్యం చెందింది. పాక్ వాణిజ్య నగరం, అతిపెద్ద నగరం అయిన కరాచీ తీవ్ర విద్యుత్ సమస్యలతో సతమతం అవుతోంది.
H3N2 Virus: దేశంలో హెచ్3ఎన్2 ఇన్ఫ్లుఎంజా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఈ వైరస్ బారిన పడిన ఓ మహిళ మరణించింది. దీంతో ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 7కు చేరుకుంది. జనవరి 1 నుంచి మార్చి 5 వరకు దేశంలో 451 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం గుజరాత్ రాష్ట్రంలో వడోదరలో 58 ఏళ్ల మహిళ హెచ్3ఎన్2 ఇన్ఫ్లుఎంజా వైరస్ కారణంగా మరణించింది. గత వారం కర్ణాటక, హర్యానాల్లో ఇద్ధరు మరణించారు. దేశంలోనే తొలిసారిగా కర్ణాటకలోని హసన్…
Congress: కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే బీజేపీపై వంగ్యాస్త్రాలు సంధించారు. నిన్న ట్రిపుల్ ఆర్ సినిమాలోని ‘‘ నాటు నాటు’’ పాటకు ‘‘ ది ఎలిఫెంట్ విస్పరర్స్’’ డాక్యుమెంటరీలకు ఆస్కార్ అవార్డులు రావడాన్ని ప్రస్తావిస్తూ పార్లమెంట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. మేము చాలా గర్వంగా ఉన్నాము.. అయితే నా ఏకైక అభ్యర్థన ఏంటంటే బీజేపీ ఈ అవార్డులు తన ఘనత అని చెప్పుకోవద్దని ఖర్గే అన్నారు.
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. బఖ్ ముత్ పట్టణంపై ఆధిపత్యం కోసం రష్యా తీవ్రదాడులు చేస్తోంది. ఒకవేళ ఈ పట్టణం రష్యా వశం అయితే ఇక ఉక్రెయిన్ కు లొంగిపోవడమే దిక్కు. రష్యన్ బలగాలు సునాయసంగా తూర్పు ప్రాంతాలపై ఆధిపత్యం కనబడిచే అవకాశం ఉంది. దీంతోనే బక్ ముఖ్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు రష్యాను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ బలగాలు పోరుగుతున్నాయి.
Man Kills Wife: పబ్లిక్ ప్లేసుకు అనుచితంగా డ్రెస్ వేసుకుని వచ్చినందుకు భర్త, భార్యను హతమార్చాడు. ఎన్నిసార్లు చెప్పిన పట్టించకోవడం లేదని కోపంతో భార్యను చంపానని నిందితుడు వెల్లడించాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని అలీగఢ్ లో జరిగింది. చిన్నపాటి గొడవ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదంగా మారి భార్య హత్యకు దారి తీసింది.
Gautam Adani's son Jeet Adani gets engaged to Diva Jaimin Shah: ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ చిన్న కొడుకు జీత్ అదానీ ఎంగేజ్మెంట్ దివా జైమిన్ షాతో ఆదివారం జరిగింది. గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగి ఈ నిశ్చితార్థానికి కేవలం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వధువు దివా ప్రముఖ వజ్రాల వ్యాపారి సి.దినేష్ & కో. ప్రైవేట్ లిమిటెడ్ యజమాని జైమిన్ షా కుమార్తె. ఈ కంపెనీ ముంబాయి, సూరత్ ప్రాంతాల్లో…
RSS: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల పదేపదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) లక్ష్యంగా పలు విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలపై ఆర్ఎస్ఎస్ స్పందించింది. రాహుల్ గాంధీ బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ఆర్ఎస్ఎస్ వాస్తవికతను చూడాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేమ హోసబాలే అన్నారు. స్వలింగ వివాహాలపై కేంద్రం దృష్టితో తాము ఏకీభవిస్తున్నామని, ఆడ, మగ వారి మధ్యే వివాహం జరుగుతుందని హోసబాలే అన్నారు.