Imran Khan Arrest: పాకిస్తాన్ రణరంగంగా మారుతోంది. సివిల్ వార్ దిశగా పాకిస్తాన్ వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడి ఆర్మీ, పోలీసులను ఇమ్రాన్ మద్దతుదారులు సవాల్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు లాహోర్ లోని జమాన్ పార్క్ వద్ద ఉన్న ఆయన నివాసానికి పంజాబ్ పోలీసులు…
Pakistan Economic Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది పాకిస్తాన్. ఐఎంఎఫ్ 1.1 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీని ఇస్తే తప్పా పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే అక్కడ ఆహార సంక్షోభం నెలకొంది. నిత్యావసరాల ధరలు పెరిగాయి. ఒక వేళ ధరలు పెరిగినా కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్న తగినంత సరకులు అందుబాటులో ఉండటం లేదు. గోధుమ పిండితో పాటు వంటనూనె, చక్కెర ఇలా పలు నిత్యావసరాల కొరత వేధిస్తోంది.
H3N2 virus Cases: హెచ్3ఎన్2 ఇన్ఫ్లుఎంజా కేసులు ప్రజలను భయపెడుతున్నాయి. కరోనా లక్షణాలు కలిగి ఉన్న ఈ వ్యాధి వల్ల ప్రజలు తీవ్ర అస్వస్థతలకు గురవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు హెచ్3ఎన్2 వైరస్ కు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేస్తున్నాయి.
Smriti Irani Slams Rahul Gandhi: ఇటీవల లండన్ వేదికగా కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ భారత ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. విదేశీ గడ్డపై భారతదేశ పరువు తీశారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి సంస్థలను ఆయన అగౌరపరిచారని అన్నారు. భారతదేశాన్ని అవమానించడం ప్రజాస్వామ్యామా..? సభాపతిని అగౌరపరచడం ప్రజాస్వామ్యామా.? అని ఆమె రాహుల్ గాంధీని ప్రశ్నించారు. వెంటనే రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Student Suicide: రాజస్థాన్ కోటాలో మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ పరీక్షకు కోచింగ్ తీసుకుంటున్న 18 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలోనే ఉరేసుకుని మరణించింది. తక్కువ మార్కులు వస్తున్నాయన్న మనస్తాపంలోనే తమ కుమార్తె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
Boy Fell In Borewell: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బోరు బావిలో పడిన పిల్లాడి ఘటనలో విషాదం చోటు చేసుకుంది. ఏడేళ్ల పిల్లాడిని రక్షించేందుకు అధికారులు శతవిధాల ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు. 24 గంటల తర్వాత పిల్లాడిని బయటకు తీసినా అప్పటికే చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివారాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ విదిషా జిల్లాలో ఏడేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. అతడిని బయటకు తీసేందుకు జిల్లా కలెక్టర్ శంకర్ భార్గవ తో పాటు పోలీస్, ఇతర అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.
Rahul Gandhi: మరికొన్ని రోజుల్లో కర్ణాటక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు కర్ణాటకకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీంతో ఇరు పార్టీలు పోటాపోటీగా ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాదిలో ఆరుసార్లు కర్ణాటకలో పర్యటించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా కర్ణాటకలో పర్యటించారు.
IIT Student Suicide: ఐఐటీ విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఐఐటీ మద్రాస్ లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 20 ఏళ్ల పుష్పక్ అనే విద్యార్థి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం తన హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. తన మరణంపై విచారణ చేయవద్దని సూసైట్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Ozone Hole: 2019-20 ఆస్ట్రేలియాలో ఏర్పడిన కార్చిచ్చు వల్ల ఓజోన్ పొర రంధ్రం విస్తరించినట్లు తాజా అధ్యయాల్లో తేలింది. ఆగ్నేయాస్ట్రేలియాలో దాదాపుగా నెల రోజల పాటు కార్చిచ్చు ఏర్పడింది. వేల హెక్టార్లలో అడవులు ధ్వంసం అయ్యాయి. ఈ భారీ కార్చిచ్చు విడుదలైన వాయువులు ఓజోన్ పొర పలుచగా మారేందుకు కారణం అయ్యాయి. 2019 డిసెంబర్ నుంచి 2020 జనవరి వరకు ఈ కార్చిచ్చు విస్తరిస్తూనే ఉంది.
Meta Layoffs: టెక్ కంపెనీలో లేఆఫ్స్ ఆగడం లేదు. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ దిగ్గజ కంపెనీలుగా పేరొందిన మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విట్టర్, అమెజాన్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను వరసగా తొలగించాయి. లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ ప్రకారం 2022 ప్రారంభం నుంచి 2,80,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో 40 శాతం మంది ఈ ఏడాదిలోనే ఉద్యోగాలను కోల్పోయారు.