Topless At Public Swimming: లింగవివక్షతను రూపుమాపేందుకు జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలోని అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు కూడా టాప్‌లెస్‌గా పబ్లిక్ స్విమ్మింగ్ ఫూల్స్ లోని ప్రవేశించడాన్ని అనుమతించింది. దీంతో ఇకపై మగవారు, ఆడవారు టాప్‌లెస్‌గా స్విమ్మింగ్ ఫూల్స్ లో ఈత కొట్టవచ్చన్నమాట. మహిళ వివక్షపై ఓ మహిళ ఫిర్యాదు ఇవ్వడంలో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also: Merapi Volcano: ఇండోనేషియాలో మెరాపి అగ్నిపర్వత విస్పోటనం..
పూర్తి వివరాల్లోకి వెళ్తే బెర్లిన్ నగరంలో లింగ భేదం లేకుండా అందరూ టాప్‌లెస్‌గా పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్‌లోకి ప్రవేశించడానికి అనుమతించింది. ఇటీవల టాప్‌లెస్‌గా సన్ బాత్ చేసినందరు ఓ యువతిని బలవంతంగా పబ్లిక్ స్విమ్మింగ్ ఫూల్ నుంచి బయటకు పంపారు. అయితే దీనిపై ఆమె తనపై వివక్ష చూపారంటూ సెనేట్ అంబుడ్స్‌పర్సన్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. మహిళా ఫిర్యాదుకు స్పందించిన అంబుడ్స్‌పర్సన్ కార్యాలయం ఇది వివక్షే అని అంగీకరించింది.
దీంతో బెర్లిన్ నగరంలో మహిళలు కూడా తమ ఒంటి పైభాగాన్ని కప్పుకోకుండా టాప్‌లెస్‌గా పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్‌లోకి అనుమతించింది. ఈ ఆదేశాల ప్రకారం బెర్లిన్ లో పబ్లిక్ పూల్స్ నిర్వహిస్తున్న బెర్లిన్ బేడర్‌బెట్రీబ్ తన దుస్తుల నిబంధనలను సవరించింది. బేడర్ బెట్రీబ్ తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి అంబుడ్స్‌పర్సన్ కార్యాలయం చాలా స్వాగతించింది. ఇది ఆడ, మగ, ట్రాన్స్ జెండర్స్ కు సమాన హక్కులను కల్పిస్తుందని పేర్కొంది.