Cyber Fraud: బ్యాంక్ ఫ్రాడ్స్, సైబర్ ప్రాడ్స్ గురించి ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు. అత్యాశకు పోయి డబ్బులను పోగొట్టుకుంటున్నారు. తాము కొనని లాటరీ టికెట్ కు లాటరీ ఎలా తగిలింది.? తమకు తెలియకుండా గిప్టులు ఎవరు పంపిస్తారు.? అని ప్రశ్నించుకుంటే ప్రజలు ఈ మోసాలకు గురికారని అధికారులు చెబుతున్నారు. ప్రజల్లో ఇంత అవగాహన పెరుగుతున్నా మోసపోయే వారు ఇంకా ఉంటున్నారు.
UP Cold Storage Roof Collapse Deaths Rise To 10: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కోల్డ్ స్టోరేజ్ పైకప్పు కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శుక్రవారం నాటికి ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 10కి చేరుకుంది. సంభాల్ జిల్లాలోని కోల్డ్ స్టోరేజ్ పైకప్పు కూలింది. కోల్డ్ స్టోరేజీ కుప్పకూలిన ఘటనలో శిథిలాల నుంచి 21 మందిని బయటకు తీస్తే ఇందులో 10 మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రగాయాలపాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై యోగి ఆదిత్య నాథ్…
Mallikarjun Kharge: ‘జాతీయ వ్యతిరేక టూల్ కిట్’లో రాహుల్ గాంధీది శాశ్వత భాగస్వామ్యం అంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే విరుచుకుపడ్డారు. బీజేపీనే దేశ వ్యతిరేకుల పార్టీ అని, వారు భారతస్వాతంత్య్ర ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనలేదని ఆయన అన్నారు. బ్రిటిష్ వారి కోసం పని చేశారని దుయ్యబట్టారు. ఇంత చేసినవారు ఇతరులను దేశ వ్యతిరేకులుగా పిలుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన రాజకీయ లబ్ధి కోసమే హిందుత్వాన్ని విడిచిపెట్టి, సూడో సెక్యుటర్ ఎజెండాను అవలంభిస్తోందని బీజేపీ, సీఎం ఏక్ నాథ్ షిండే శివసేన ఆరోపిస్తోంది. శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. అయితే ఈ విమర్శలకు ఉద్ధవ్ ఠాక్రే ఘాటుగానే బదులిచ్చారు. బీజేపీ రథయాత్ర చేసినప్పుడు మద్దతు ఇచ్చిన ఏకైక పార్టీ శివసేన అని ఉద్దవ్ అన్నారు.
2 People Die Of Suspected H3N2 Virus: హెచ్3ఎన్2 ఇన్ఫ్లుఎంజా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. పలు రాష్ట్రాల్లో వందల్లో ఇన్ఫ్లుఎంజా కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో ఇప్పటికే హెచ్3ఎన్2 కారణంగా పలువురు మరణించారు. కర్ణాటకలోని హసన్ లో తొలి హెచ్3ఎన్2 వైరస్ మరణం నమోదు అయింది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల రాష్ట్రంలో ఇద్దరు మరణించడంతో అక్కడి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయింది.
Rapido Driver Inappropriate Behavior: మహిళా కస్టమర్ల పట్ల క్యాబ్ సంస్థల డ్రైవర్లు అనుచితంగా ప్రవర్తించడం, అసభ్యంగా వ్యవహిరించడం వంటి ఘటనలు ఇది వరకు చాలా సార్లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే తెరపైకి వచ్చింది. రాపిడో బుక్ చేసుకున్న ఓ మహిళకు సదరు డ్రైవర్ నుంచి అనుచితమైన మెసేజ్ లు వచ్చాయి. దీంతో కంగుతిన్న ఆ మహిళ, అతడు చేసిన చాటింగ్ ను ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ఈ ఘటనపై రాపిడో సంస్థ కూడా స్పందించింది. నెటిజన్లు మహిళ ధైర్యాన్ని…
India invites Pakistan: ఏప్రిల్ నెలలో జరగనున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీఓ) సమావేశానికి పాకిస్తాన్ దేశాన్ని భారత్ ఆహ్వానించింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరగాల్సిన ఎస్ సీఓ రక్షణ మంత్రుల సమావేశానికి భారతదేశం నుంచి ఆహ్వనం అందినట్లు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుకు కూడా భారత్ ఆహ్వానం పంపింది. ఖవాజా భారత్ పంపిన ఆహ్వానాన్ని అంగీకరించారు.
Pune: పూణేలో ఘోరం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం ఫ్లాట్ లో శవాలై కనిపించారు. అయితే పోలీసులు ఇది హత్య-ఆత్మహత్య ఘటనగా అనుమానిస్తున్నారు. భార్య, పిల్లల ముఖాలకు పాలిథీన్ సంచులు చుట్టి ఉండటంతో పాటు భర్త ఉరేసుకుని ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే 44 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్, అతడి భార్య, ఎనిమిదేళ్ల కుమారుడు బుధవారం పూణేలోని ఔంద్ ప్రాంతంలోని వారి ఫ్లాట్లో శవమై కనిపించినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిని సుదీప్తో గంగూలీ, అతడి భార్య ప్రియాంక, 8…
Caffeine: కాఫీ అతిగా తాగితే అనర్థాలు ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే కాఫీలో ఉండే కెఫిన్ వల్ల ఊబకాయం, డయాబెటిస్ వంటివి వచ్చే ప్రమాదం తగ్గిస్తుందని తాజా అధ్యయనం కనుగొంది. అధిక స్థాయిలో కెఫిన్ తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుందని, టైప్ 2 డయాబెటిస్ తో పాటు గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ తగ్గుతుందని అధ్యయనం పేర్కొంది.
MLC Kavitha: మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు ఒత్తిడి కొనసాగిస్తామని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఈ రోజు ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి వివిధ పార్టీల నుంచి నాయకులు హాజరయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఒక్కో అడుగు ముందుకు వేద్దాం అని, మహిళలకు ఎవరూ ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం లేదని, అందుకు మహిళా రిజర్వేషన్లను కోరుకుంటున్నామని ఆమె అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు బిల్లు…