Cyber Fraud: బ్యాంక్ ఫ్రాడ్స్, సైబర్ ప్రాడ్స్ గురించి ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు. అత్యాశకు పోయి డబ్బులను పోగొట్టుకుంటున్నారు. తాము కొనని లాటరీ టికెట్ కు లాటరీ ఎలా తగిలింది.? తమకు తెలియకుండా గిప్టులు ఎవరు పంపిస్తారు.? అని ప్రశ్నించుకుంటే ప్రజలు ఈ మోసాలకు గురికారని అధికారులు చెబుతున్నారు. ప్రజల్లో ఇంత అవగాహన పెరుగుతున్నా మోసపోయే వారు ఇంకా ఉంటున్నారు.
Read Also: Rana Daggubati: కన్నుకు, కిడ్నీకి సర్జరీ జరిగింది.. అనారోగ్య సమస్యలపై మొదటిసారి నోరువిప్పిన రానా
తాజాగా మహారాష్ట్ర థానే నగరానికి చెందిన 36 ఏళ్ల మహిళను సైబర్ మోసగాళ్లు మోసం చేశారు. ఏకంగా రూ. 12 లక్షలకు పైగా డబ్బును పోగొట్టుకుంది. ఇద్దరు నిందితులు ఈ మోసానికి పాల్పడ్డారు. అయితే ఇందులో ఒకరు సదరు మహిళకు 2022 నుంచి సోషల్ మీడియాలో స్నేహం చేస్తున్నాడు. తాను మలేషియాకు చెందినవాడినని, యూకేలో పనిచేస్తున్నట్లు మహిళను నమ్మించాడు. నిందితుడు సదరు మహిళకు గిఫ్ట్ పంపిస్తున్నట్లు నమ్మించాడు. ఆ సమయంలోనే ఢిల్లీ కస్టమ్స్ అధికారిగా ఉన్న మహిళ నుంచి తనకు కాల్ వచ్చినట్లు మహిళ పేర్కొంది.
కస్టమ్స్ నుంచి గిఫ్ట్ పార్సిల్స్ విడుదల చేయాలంటే డబ్బు చెల్లించాలని చెప్పారని, విదేశీ కరెన్సీతో పాటు బహుమతి పొందడానికి డబ్బు చెల్లించాలని చెప్పడంతో బాధిత మహిళ బ్యాంకు లావాదేవీల ద్వారా రూ.12.47 లక్షలు చెల్లించిందని, ఆ తరువాత తాను మోసపోయినట్టు గుర్తించిందని పోలీస్ అధికారులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా నిందితులు ఇద్దరిపై ఐపీసీ 420, ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు.