Rapido Driver Inappropriate Behavior: మహిళా కస్టమర్ల పట్ల క్యాబ్ సంస్థల డ్రైవర్లు అనుచితంగా ప్రవర్తించడం, అసభ్యంగా వ్యవహిరించడం వంటి ఘటనలు ఇది వరకు చాలా సార్లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే తెరపైకి వచ్చింది. రాపిడో బుక్ చేసుకున్న ఓ మహిళకు సదరు డ్రైవర్ నుంచి అనుచితమైన మెసేజ్ లు వచ్చాయి. దీంతో కంగుతిన్న ఆ మహిళ, అతడు చేసిన చాటింగ్ ను ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ఈ ఘటనపై రాపిడో సంస్థ కూడా స్పందించింది. నెటిజన్లు మహిళ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
రాపిడో బుక్ చేసుకున్న ఓ మహిళ తన లొకేషన్ ను వాట్సాప్ ద్వారా షేర్ చేసింది. ఆ తరువాత ఆమెకు అనుచితమైన మెసేజ్ లు వచ్చాయి. హస్న్ పారి పేరుతో ఉన్న అకౌంట్ ద్వారా మహిళ డ్రైవర్ చేసిన మెసేజ్ లను పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. మహిళ పంచుకున్న స్క్రీన్ షాట్ ప్రకారం.. ‘‘ మీ వాయిస్ విన్న తర్వాత, మీ డీపీ చూసిన తర్వాత మాత్రమే తాను వచ్చానని, లేకపోతే పికప్ కోసం వచ్చే వాడిని కాదు’’ అంటూ మెసేజ్ చేశాడు. దీనిపై సదరు మహిళ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. క్యాబ్ కంపెనీ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
shared my location with a captain at @rapidobikeapp and this is what i get???? FUCK YOUR APP FUCK YOUR MEN FUCK MEN pic.twitter.com/EHLqd7lpt5
— husnpari (@behurababe) March 12, 2023
Read Also: Transgender : పెళ్లిలో డబ్బులు ఇవ్వలేదు.. రెచ్చిపోయిన హిజ్రాలు
దీనిపై రాపిడో సంస్థ స్పందించింది. ‘‘హాయ్.. డ్రైవర్ కు వృత్తి నైపుణ్యం లేకపోవడం మమ్నల్ని నిరుత్సాహపరిచింది. మేము దీనికి క్షమాపణలు చెబుతున్నాం. మీ ఫిర్యాదును ప్రాధాన్యత అంశంగా తీసుకుంటాం. దయచేసి మీ మొబైల్ నెంబర్, రైడ్ ఐడీని పంపిస్తారా..?’’ అంటూ మహిళను కోరింది.
దీనిపై నెటిజన్లు రాపిడో సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో రాపిడో సురక్షితం కాదని ఓ నెటిజన్ రాయగా.. ఈ యాప్‌లన్నీ మీ లొకేషన్ తెలియని వ్యక్తులకు తెలియజేస్తుంది అన్నాడు. రాపిడో రైడర్లు కేవలం అమ్మాయిల రైడ్స్ మాత్రమే అంగీకరిస్తారని, మగవాళ్లు బుక్ చేస్తే తిరస్కరిస్తారని నాకో రాపిడో నడిపే రైడర్ చెప్పారంటూ ఓ నెటిజెన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఆటోలు, క్యాబ్ లను నుంచి ఇంత కంటే ఎం ఎక్స్పెక్ట్ చేయలేమని మరో నెటిజెన్ వ్యాఖ్యానించారు.
One Rapido Wale bhaiya told me that guys are riding Rapido bikes only so that they can take rides of girls in the bike whom he could never got in any life. They only accept rides from girls, reject rides from male customer. I have got many times rejected by riders.
— Rishabh Gupta🇮🇳 (@RishabhCodes) March 15, 2023
Disgusting. Having used public transport for a long time, I expect nothing better from cabs and autos. We need more women in transport ecosystem.
— cheenikum (she/her) (@juhi_tulip) March 15, 2023