Pune: పూణేలో ఘోరం జరిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబం ఫ్లాట్ లో శవాలై కనిపించారు. అయితే పోలీసులు ఇది హత్య-ఆత్మహత్య ఘటనగా అనుమానిస్తున్నారు. భార్య, పిల్లల ముఖాలకు పాలిథీన్ సంచులు చుట్టి ఉండటంతో పాటు భర్త ఉరేసుకుని ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే 44 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్, అతడి భార్య, ఎనిమిదేళ్ల కుమారుడు బుధవారం పూణేలోని ఔంద్ ప్రాంతంలోని వారి ఫ్లాట్‌లో శవమై కనిపించినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిని సుదీప్తో గంగూలీ, అతడి భార్య ప్రియాంక, 8 ఏళ్ల కుమారుడు తనిష్కగా గుర్తించారు. ముందుగా భార్య పిల్లలను చంపేసి, సుదీప్తో ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also: Ram Gopal Varma: తినండి.. తాగండి.. సెX చేయండి.. విద్యార్థులకు ఆర్జీవీ పాఠాలు
బెంగళూర్ లో ఉంటున్న సుదీప్తో సోదరుడు ఫోన్ చేయగా.. భార్యభర్తలు ఇద్దరు స్పందించలేదు. అనుమానించిన అతడు, తన స్నేహితుడిని సుదీప్తో ఫ్లాట్ కు వెళ్లాల్సిందిగా కోరాడు. అయితే అతను వెళ్లిన సమయంలో ఫ్లాట్ లాక్ చేసి ఉంది. దీంతో తప్పిపోయిన వ్యక్తులపై పూణేలోని చతుష్రింగి పోలీస్ స్టేషన్ లోొ ఫిర్యాదు చేశారు. పోలీసులు లొకేషన్ డేటా ఆధారంగా సుదీప్తో కుటుంబం మొబైల్ ఫోన్లు ఫ్లాట్ లోనే ఉన్నట్లు గుర్తించారు. డూప్లీకేట్ తాళాన్ని ఉపయోగించి ఫ్లాట్ లోకి వెళ్లగా అక్కడ సుదీప్తో ఉరివేసుకుని మరణించాడు. తల్లి,బిడ్డల ముఖాలకు పాలిథిన్ కవర్లు చుట్టి ఉన్నాయి. ఘటన ప్రదేశంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీస్ అధికారులు తెలిపారు. సుదీప్తో సొంత వ్యాపారం ప్రారంభించేందుకు సాఫ్ట్ వేర్ సంస్థలో తన ఉద్యోగాన్ని వదిలిపెట్టినట్లు తేలింది. తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.