Maruti Suzuki Brezza CNG: అన్ని ప్రముఖ ఆటో కార్ మేకర్స్ ఈవీపై దృష్టి సారిస్తుంటే.. ఇండియాలో అతిపెద్ద కార్ మార్కెట్ ను కలిగి ఉన్న మారుతి సుజుకీ మాత్రం సీఎన్జీ కార్లపై కాన్సన్ట్రేట్ చేస్తోంది. ఇప్పటికే మారుతి నుంచి ఆల్టో, వ్యాగర్ ఆర్, స్విఫ్ట్, ఎర్టిగా సీఎన్జీ మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. అయితే తాజాగా తన ప్లాగ్ షిస్ మోడల్ బ్రెజ్జాను సీఎన్జీలో తీసుకురాబోతోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది ద్వితీయార్థంలో బ్రెజ్జా సీఎన్జీ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది.
Amit Shah: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. ఉమ్మడి మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఎమ్మెల్యే ఎన్నికలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపొందడంపై కేంద్ర హోమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ ద్వారా గెలిచిన అభ్యర్థికి, బీజేపీ కార్యకర్తలు, నాయకులకు అభినందనలు తెలియజేశారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన ఏవీఎన్ రెడ్డికి, ఆయన గెలుపు కోసం పనిచేసిన బీజేపీ శ్రేణులకు అమిత్ షా అభినందనలు తెలిపారు.
Mamata Banerjee-Akhilesh Yadav New Front Without Congress: 2024 లోక్ సభ ఎన్నికల ముందు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు విపక్ష పార్టీలు తమ ఎన్నికల ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రుణమూల్ చీఫ్ మమతా బెనర్జీని కోల్కతాలో కలిశారు. ఇరువురు నేతల భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు…
Scotland Woman Gets Baby Son's Body From Hospital After 48 Years: చనిపోయిన తన బిడ్డ అవశేషాల కోసం ఓ తల్లి ఏకంగా నాలుగున్నర దశాబ్ధాలుగా పోరాడుతోంది. తన బిడ్డకు ఏమైందని తెలుసుకోవాలని పోరాడుతోంది. చివరకు సుదీర్ఘ పోరాటం తర్వాత 48 ఏళ్లకు తన కొడుకు అవశేషాలను శుక్రవారం పొందింది. వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన యూకేలో జరిగింది. స్కాట్లాండ్ కు ఎడిన్ బర్గ్ కు చెందిన లిడియా రీడ్ అనే మహిళ 1975లో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం లిడియా…
Fake PMO Officer: ప్రధానమంత్రి కార్యాలయ (పీఎంఓ) అధికారినంటూ గుజరాత్ కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగాన్నే బురిడి కొట్టించాడు. ఏకంగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతూ.. స్టార్ హోటళ్లలో బస చేస్తూ సకలభోగాలను అనుభవించాడు. ఇదిలా ఉంటే సరిహద్దులోని సున్నిత ప్రాంతాలను పర్యటించాడు. ఆయకు భద్రత కల్పిస్తున్న సిబ్బందితో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. అయితే చివరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులకు పట్టుబడ్డాడు.
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాను ఈడీ విచారిస్తోంది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సౌత్ గ్రూప్ తో కుమ్మక్కు అయి 5 శాతం నుంచి 12 శాతం మార్జిన్ పెంచినట్లుగా తేలింది. ఆధారాలు దొరక్కుండా అన్ని డిజిటల్ ఫోన్లను ధ్వంసం చేశారు. ఓబెరాయ్ హోటల్ కేంద్రంగా ఇవన్నీ జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. లిక్కర్ కేసుకు సంబంధించి కీలక డిజిటల్ సాక్ష్యాలను మాయం చేశారు. లిక్కర్ స్కాం సమయంలో 14 ఫోన్లను ధ్వంసం చేశారని తేలింది. దర్యాప్త…
Pakistan Army Chief Supports Imran Khan's Arrest: ఇమ్రాన్ ఖాన్ రాజకీయ జీవితానికి ముగింపు పలికే దిశగా అక్కడి ప్రభుత్వం, ఆర్మీ ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ అరెస్టును పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సమర్థిస్తున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ డాన్ నివేదించింది. ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసి పొలిటికల్ కెరీర్ ను అంతం చేయడాన్ని ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సమర్థించినట్లు తెలిసింది. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే తనకు ప్రమాదం ఉందని, అరెస్ట్ చేసి చంపాలను ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ఆర్మీ, పాకిస్తాన్…
Mega Textile Parks: దేశంలో ఏడు రాష్ట్రాల్లో మెగా టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ టెక్స్టైల్ 5ఎఫ్(ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్) విజన్ కి అనుగుణంగా టెక్స్టైల్స్ రంగాన్ని ప్రోత్సహిస్తాయని మోదీ వెల్లడించారు. తమిళనాడు, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ లలో పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నందుకు…
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరో 5 రోజుల కస్టడీని పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మరో 7 రోజులు సిసోడియాను విచారించేందుకు సమయం కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టును కోరింది. అయితే కోర్టు మరో 5 రోజుల కస్టడీకి అప్పగించింది.
Labourer Wins Lottery: అదృష్టం అంటే ఇతడితే ఎక్కడో పశ్చిమ బెంగాల్ నుంచి కూలీగా పనిచేసేందుకు కేరళకు వచ్చిన ఓ వ్యక్తి ఏకంగా రూ. 75 లక్షల లాటరీని గెలుచుకున్నారు. బెంగాల్ కు చెందిన ఎస్కే బాదేశ్ కేరళ ప్రభుత్వ స్త్రీ శక్తి లాటరీలో టికెట్ కొనుగోలు చేశాడు. అయితే అదృష్టవశాత్తు బాదేశ్ ను లాటరీ తగిలింది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. తనకు మళయాళం రాదు, రాష్ట్రం కానీ రాష్ట్రం, తనను మోసగించి ఎవరైనా లాటరీ టికెట్ లాగేసుకుంటారని భయపడని బాదేశ్…