OnePlus Turbo కొత్త సిరీస్.. 16GB ర్యామ్, Android 16తో పాటు 9,000mAh బ్యాటరీ
- త్వరలో మార్కెట్‌లోకి కొత్త OnePlus Turbo సిరీస్..
- ప్రధానంగా గేమింగ్‌పై దృష్టి సారించిన OnePlus Turbo..
- 16GB ర్యామ్, Android 16తో పాటు 9,000mAh బ్యాటరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus Turbo: త్వరలో చైనా మార్కెట్‌లో కొత్త OnePlus Turbo సిరీస్ ను విడుదల చేయనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో ప్రధానంగా గేమింగ్‌పై దృష్టి సారించిన స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయని పేర్కొంది. అయితే, ఇప్పటి వరకు ఈ ఫోన్లకు సంబంధించిన లాంచ్ తేదీ, ధర, పూర్తి స్పెసిఫికేషన్లను వన్‌ప్లస్ మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా OnePlus Turbo సిరీస్‌కు చెందిన ఒక మోడల్ బెంచ్‌మార్క్ ప్లాట్‌ఫామ్‌లో కనిపించడం టెక్ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది.
Also Read
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
- Top 5 Expensive Phones: భారత్‌లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్‌ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
- Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
అయితే, OnePlus Turbo ఫోన్‌లో ఆక్టా-కోర్ ARMv8 చిప్‌సెట్ ఉండనుంది. ఇది క్వాల్కమ్ Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ అయ్యే అవకాశం ఉందని అంచనా. ఈ చిప్‌సెట్‌లో 3.21GHz క్లాక్ స్పీడ్‌తో ఒక ప్రైమ్ కోర్, మూడు పెర్ఫార్మెన్స్ కోర్లు, నాలుగు ఎఫిషియెన్సీ కోర్లు ఉండగా, గ్రాఫిక్స్ కోసం Adreno 825 GPUను అందించనున్నట్లు తెలుస్తుంది.
Read Also: 7,600mAh+ బ్యాటరీ.. 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్.. iQOO Z11 Turbo ఫోన్‌లో ఫీచర్స్ అదుర్స్!
ఇక, లిస్టింగ్‌లో ఫోన్‌కు 14.81GB ర్యామ్ చూపించగా, ఇది వాణిజ్యంగా 16GB ర్యామ్ గా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్ తో పని చేయనున్నట్లు తెలుస్తోంది. లాంచ్ టైమ్‌లైన్ విషయానికి వస్తే, OnePlus Turbo ఫోన్‌ను వచ్చే ఏడాది జనవరిలో చైనా మార్కెట్‌లో రిలీజ్ చేయవచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, వన్‌ప్లస్ చైనా ప్రెసిడెంట్ లి జీ లూయిస్ ఇటీవల వీబో వేదికగా మాట్లాడుతూ.. OnePlus Turbo సిరీస్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని అధికారికంగా ధృవీకరించారు. ఈ కొత్త సిరీస్‌ను వన్‌ప్లస్ 12వ వార్షికోత్సవ వేడుకల్లో కూడా ప్రస్తావించారు. ఈ లైనప్ పూర్తిగా గేమింగ్ యూజర్లను లక్ష్యంగా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, ఇప్పటి వరకు వచ్చిన లీక్‌ల ప్రకారం, OnePlus Turbo ఫోన్‌ను OnePlus Ace 6 Turbo పేరుతో కూడా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 9,000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల LTPS OLED డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్, అలాగే 144Hz లేదా 165Hz రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ అన్ని వివరాలను పరిగణనలోకి తీసుకుంటే, OnePlus Turbo సిరీస్ గేమింగ్ ప్రియులకు అనుకూలంగా ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో ఆకర్షణీయమైన ఎంపికగా మారే అవకాశం ఉంది. ఫోన్ లాంచ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం వినియోగదారులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
తాజావార్తలు
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్‌తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?