UK: విదేశాల్లో ఉంటున్న ఖలిస్తానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. కెనడా, యూకే, ఆస్ట్రేలియాల్లో భారత వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు గత రెండు రోజులుగా గాలిస్తున్నారు. ఇప్పటికే అతని అనుచరులు, బాడీగార్డులను కలిపి 78 మందిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే పంజాబ్ పోలీసులు, కేంద్ర బలగాలు తీసుకుంటున్న ఈ చర్యలపై విదేశాల్లో కూర్చుని ఉన్న ఖలిస్తానీ మద్దతుదారులకు నచ్చడం లేదు.
PM Narendra Modi: ప్రధాని మోదీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ప్రపంచ దిగ్గజ నాయకుల్లో ఒకరిగా ప్రశంసిస్తున్నారు. అయితే మనం శతృవుగా భావించే చైనాలో కూడా మోదీకి ఆదరణ పెరుగుతోంది. ఏకంగా మోదీకి ముద్దు పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. చైనా ప్రజల నుంచి ఇంతకుముందు ఏ విదేశీ నేతకు ఇంత ఆదరణ రాలేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఉన్నా.. చైనా ప్రజలు మాత్రం మోదీని అసాధారణ నేతగా పరిగణిస్తున్నారు.
Jairam Ramesh: కాంగ్రెస్ లేకుండా బీజేపీ ఎదుర్కోవడం ఏ ఫ్రంట్ కు సాధ్యం కాదని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఏర్పడితే అందులో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన పాత్ర అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. అయితే రాబోయే కర్ణాటక ఎన్నికలతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయని, ఇప్పుడే పొత్తుల గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుందని ఆయన అన్నారు. ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయిన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ లేకుండా…
Kerala: కేరళలో క్రైస్తవ మతగురువు బీజేపీకి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఉత్తర కేరళలోని తలస్సేరిలోని రోమన్ క్యాథలిక్ చర్చి ఆర్చ్ బిషప్ మార్ జోసెఫ్ పాంప్లానీ చేసిన ప్రకటనను అధికార కమ్యూనిస్ట్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీలు ఖండించాయి. చర్చి సాధారణంగా ఏ పార్టీకి మద్దతు ఇవ్వదు, అయితే రైతులకు అండగా నిలిచే ఏ ప్రభుత్వానికైనా, పార్టీకైనా మద్దతు ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీహార్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ‘సీమాంచల్ అధికార యాత్ర’లో ప్రసంగిస్తూ.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. సీఎం నితీష్ కుమార్ వల్లే తమ ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారంటూ మండిపడ్డారు. ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉన్న సీమాంచ్ ప్రాంతంలో ఓవైసీ మూడు రోజులు పర్యటించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీమాంచల్ ప్రజలపై చూపిస్తున్న విపక్షకు వ్యతిరేకంగా మార్చి 18, మార్చి 19 తేదీల్లో ‘సీమాంచల్ అధికార యాత్ర’ జరుపుతున్నారు.
Karnataka: బీజేపీ నేత, మాజీ మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యలపై ముస్లింలు మండిపడుతున్నారు. ఆయన ఇటీవల నమాజ్, అల్లాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ముస్లింలు నిరసన తెలుపుతున్నారు. కర్ణాటక శివమొగ్గ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు ముస్లిం సంఘాల సభ్యులు భారీగా చేరుకుని ఆజాన్ పఠించారు. భారీగా హాజరైన ముస్లింలు ప్రార్థనలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ముందు కూడా ఇదే విధంగా చేస్తామని హెచ్చరించారు.
Elon Musk: డొనాల్డ్ ట్రంప్ ను అరెస్ట్ చేసి, ఆయనపై నేరాలు మోపితే 2024 అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయం సాధించడం ఖాయం అని ప్రపంచ టాప్-1 బిలియనీర్ ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. వచ్చే వారం ట్రంప్ పై అభియోగాలు మోపుతారనే వార్తలపై ఎలాన్ మస్క్ స్పందించారు. ఇదే జరిగితే ఆయన అద్భుత విజయం ఖాయమని అన్నారు.
"Khalistan" trending on Twitter: ఖలిస్తాన్ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ నేత అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేసేందుకు పంజాబ్ పోలీసులు, కేంద్ర బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పంజాబ్ తో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలను జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే అమృత్ పాల్ సింగ్ అనుచరులు, బాడీగార్డులను కలుపుకుని 78 మందిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ అంతటా ఎలాంటి విద్వేష సంఘటనలు జరగకుండా పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపేశారు.
India Power Consumption: భారత దేశంలో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యుత్ వినియోగం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరిలో భారతదేశ విద్యుత్ వినియగోం 10 శాతం పెరిగి 1375.57 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. 2021-22లో సరఫరా అయిన విద్యుత్ ను ఇప్పటికే అధిగమించాం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1245.54 బిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. తాజాగా ఈ ఏడాది దాన్ని మించిన విద్యుత్ వినియోగం జరిగింది.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కు ఉచ్చుబిగుస్తోంది. ఇప్పటికే పలు కేసుల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పై తాజాగా పోలీసులు తీవ్రవాద కేసు నమోదు చేశారు. అవినీతి కేసులో కోర్టు విచారణకు ముందు ఇస్లామాబాద్‌లోని జ్యుడిషియల్ కాంప్లెక్స్ వెలుపల విధ్వంసానికి పాల్పడడం, భద్రతా సిబ్బందిపై దాడి చేయడం, శాంతి భద్రతలకు భంగం కలిగించినందుకు ఇమ్రాన్ ఖాన్ తో పాటు మరికొంత మందిపై పాకిస్తాన్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.