India Power Consumption: భారత దేశంలో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యుత్ వినియోగం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరిలో భారతదేశ విద్యుత్ వినియగోం 10 శాతం పెరిగి 1375.57 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. 2021-22లో సరఫరా అయిన విద్యుత్ ను ఇప్పటికే అధిగమించాం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1245.54 బిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. తాజాగా ఈ ఏడాది దాన్ని మించిన విద్యుత్ వినియోగం జరిగింది.
Read Also: Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు బిగుస్తున్న ఉచ్చు.. పాక్ మాజీ ప్రధానిపై ఉగ్రవాద కేసు
ముఖ్యంగా వేసవిలో అధిక విద్యుత్ డిమాండ్ ఉండనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రానున్న నెలల్లో విద్యుత్ వినియోగం రెండంకెలకు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ఏప్రిల్ లో దేశంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తోంది. 229 గిగావాట్స్ విద్యుత్ వినియోగం ఉండే అవకాశం ఉంది. గతేడాది ఇదే నెలలో నమోదైన 215.88 గిగావాట్స్ కన్నా ఈ ఏడాది ఎక్కువగా ఉండనుంది.
విద్యుత్ డిమాండ్ ను తీర్చడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ అనేక చర్యలు తీసుకుంది. విద్యుత్ కోతలు, లోడ్ షెడ్డింగ్స్ వెళ్లవద్దని రాష్ట్రాలను కోరింది. దిగుమతి చేసుకున్న బోగ్గు ఆధారితంగా పనిచేసే విద్యుత్ ఫ్లాంట్లన్నీ మార్చి మార్చి 16, 2023 నుండి జూన్ 15, 2023 వరకు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే నెలల్లో వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వేసవిలో ఏసీలు, రిఫ్రిజ్ రేటర్ల అధిక వినియోగం ఉండటం వల్ల డొమెస్టిక్ వినియోగం కూడా ఎక్కువగా ఉండనుంది. ఏప్రిల్ నుంచి భారతదేశంలో అధికి విద్యుత్ డిమాండ్ ఉండనుంది. దీన్ని తీర్చడం ప్రభుత్వానికి సవాల్ గా మారనుంది.