Rahul Gandhi: మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయన్న వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ పోలీసులు ఆదివారం ఆయన ఇంటికి వెళ్లారు. ఈ వ్యాఖ్యలపై ఆయన నుంచి వివరాలు కోరుతున్నారు పోలీసులు. ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) సాగర్ ప్రీత్ హుడా నేతృత్వంలోని పోలీస్ టీం తుగ్లక్ లేన్ లో ఉన్న రాహుల్ ఇంటికి వెళ్లింది.
Akhilesh Yadav: ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. గతంలో కాంగ్రెస్ కూడా ఇదే విధంగా చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పని అయిపోయిందని, రానున్న కాలంలో బీజేపీకి కూడా ఇదే గతి పడుతుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
Putin Visits Mariupol: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆక్రమిత ఉక్రెయిన్ లో ఆకస్మికంగా పర్యటించారు. మారియోపోల్ నగరాన్ని సందర్శించారు. యుద్దం ప్రారంభం అయిన తర్వాత ఈ నగరాన్ని రష్య ఆక్రమించింది. తాజాగా మొదటిసారిగా పుతిన్ ఈ నగరాన్ని సందర్శించారు. వేలాది మంది ఉక్రెయిన్ పిల్లలపై రష్యా అకృత్యాలకు పాల్పడిందని ఇంటర్నెషనల్ క్రిమినల్ కోర్టు పుతిన్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఈ పర్యటన జరిగింది.
Punjab: ఖలిస్తానీ నాయకుడు అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసులు ముమ్మరంగా వెతుకుతున్నారు. పంజాబ్ పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగాలు పంజాబ్ ను జల్లెడ పడుతున్నాయి. ఇదిలా ఉంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పంజాబ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేశారు. ఇదిలా ఉంటే అమృత్ పాల్ సింగ్ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 78 మందిని అరెస్ట్ చేశారు.
Amritpal Singh: పంజాబ్ లో హై అలర్ట్ నెలకొంది. పంజాబ్ వ్యాప్తంగా పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్ ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ నేత అమృత్ పాల్ సింగ్ కోసం విస్తృతంగా వెతుకుతున్నారు. అతడిని పట్టుకునేందుకు నిన్న పంజాబ్ ప్రభుత్వం ఆపరేషన్ ప్రారంభించింది. నిన్న దొరికినట్లే దొరికి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పటు చేశారు. చాలా ప్రాంతాల్లో ఇంటర్నెర్ సర్వీసులను షట్ డౌన్ చేశారు. అమృత్ పాల్ సింగ్ కోసం అనుమానం…
Pak Police Recovers Weapons, Petrol Bombs From Imran Khan's House: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తోషాఖానా కేసులో ఆయన్న అరెస్ట్ చేసేందుకు రెండు రోజల క్రితం ప్రయత్నించగా.. ఆయన మద్దతుదారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇదిలా ఉంటే శనివారం అవినీతి కేసులో ఇస్లామాబాద్ కోర్టుకు హాజరయ్యేందుకు ఇమ్రాన్ ఖాన్ వెళ్లారు. దీంతో లాహోర్ లోని జమాన్ పార్క్ ఏరియాలో…
PM Narendra Modi: భారతదేశ ప్రజాస్వామ్య విజయం, ప్రజాస్వామ్య సంస్థల విజయం కొంతమందిని బాధిస్తోందని, అందుకు వారు ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ శనివారం అన్నారు. ఇటీవల ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశం ఆత్మ విశ్వాసం, సంకల్పంతో ముందుకు వెళ్తూ, ప్రపంచంలోని మేధావులు భారత్ పట్ల ఆశాజనకంగా ఉండే సమయంలో కొందరు నిరాశవాదం, దేశాన్ని తక్కువ చేసేలా, దేశ నైతికత దెబ్బతినేలా మాట్లాడుతున్నారని ఆయన ఇండియా టుడే కాంక్లేవ్‌లో అన్నారు.
Meta Paid Verification: ట్విట్టర్ దారిలోనే మెటా కూడా బ్లూ టిక్ వెరిఫికేషన్ కోసం ఛార్జీలను వసూలు చేయడం ప్రారంభించింది. అమెరికాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పెయిడ్ వెరిఫికేషన్ ను పరీక్షించడం ప్రారంభించినట్లు సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించారు. మెటా శుక్రవారం అమెరికా వినియోగదారుల కోసం పెయిడ్ వెరిఫికేషన్ ఆప్షన్ ను పరీక్షించడం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. రాబోయే కొన్ని రోజుల్లో మరింత మంది యూఎస్ వినియోగదారులకు పెయిడ్ ఆప్షన్ అందించాలని కంపెనీ యోచిస్తోంది.
PFI wanted Islamic Rule by waging war against govt: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హింసాత్మక మార్గాల ద్వారా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి, ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ తన ఛార్జిషీట్ లో పేర్కొంది. ఎన్ఐఏ ఈ కేసులో ఐదో ఛార్జీషీట్ లో 12 మంది పీఎఫ్ఐ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఎన్ఈసీ) సభ్యులు, వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ నాయకులతో సహా పీఎఫ్ఐకి చెందిన 19 వ్యక్తలపై అభియోగాలు…
NEET: ఏడాదికి రెండుసార్లు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ని నిర్వహించేలా జాతీయవైద్య కమిషన్(ఎన్ఎంసీ), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆరోగ్య సహాయమంత్రి భారతి ప్రవన్ పవార్ క్లారిటీ ఇచ్చారు. అలాంటి ప్రతిపాదన ఏం లేదని ఆమె లోక్ సభకు తెలియజేశారు. నీట్ ను ఏడాదికి రెండుసార్లు నిర్వహించే ఆలోచన లేదని కేంద్రం ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం లోక్ సభకు తెలిపింది.