Karnataka: బీజేపీ నేత, మాజీ మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యలపై ముస్లింలు మండిపడుతున్నారు. ఆయన ఇటీవల నమాజ్, అల్లాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ముస్లింలు నిరసన తెలుపుతున్నారు. కర్ణాటక శివమొగ్గ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు ముస్లిం సంఘాల సభ్యులు భారీగా చేరుకుని ఆజాన్ పఠించారు. భారీగా హాజరైన ముస్లింలు ప్రార్థనలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ముందు కూడా ఇదే విధంగా చేస్తామని హెచ్చరించారు.
Read Also: Crime News: కన్నతల్లిని చంపి ఐదు ముక్కలు చేసిన కూతురు.. రెండు నెలలుగా ఇంట్లోనే
ఈశ్వరప్ప మా తల్లిదండ్రులపై మాట్లాడితే వదిలేస్తాం, కానీ అల్లా, అజాన్ గురించి కామెంట్స్ చేశారని, కావాలంటే కర్ణాటక అసెంబ్లీ ముందు కూడా అజాన్ చదువుతాం, మేం పరికివాళ్ల కాదని, ముస్లిం సమాజం అంతా ఏకం కావాలని అని కలెక్టరేట్ ముందు హాజరైన ముస్లింలు అన్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై శివమొగ్గ పోలీసులు 107 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం చేయవద్దని, వారిని వదిలిపెట్టబోమని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు, విచారణ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే ఈశ్వరప్ప వ్యాఖ్యలపై జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి మండిపడ్డారు. ఇలాంటి సున్నితమైన విషయాలపై వివాదాలకు బీజేపీనే కారణం అని ఆరోపించారు. ఏ బీజేపీ నాయకుడైనా వారి పరిమితుల్లో ఉండాలని సూచించారు. దేశం శాంతియుతంగా ఉండాలన్నారు. మతసామరస్యాన్ని చెడగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప మాట్లాడుతూ.. ఆజాన్ కోసం ఉపయోగించ లౌడ్ స్పీకర్లు ప్రజలకు, ముఖ్యంగా పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులకు, ఆస్పత్రితో రోగులకు ఇబ్బంది కలిగిస్తున్నాయని అన్నారు.