Supreme Court: వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీకోర్టు సీరియస్ అయింది. వివేకా హత్య కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు అడిగింది. విచారణపై తాజా పరిస్థితిని సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. వివేకా హత్య కేసును ఎందుకు దర్యాప్తు చేయడం లేదని సీబీఐని ప్రశ్నించింది. దర్యాప్తు అధికార ఎందుకు విచారణను జాప్యం చేస్తున్నారని అడిగింది. విచారణ త్వరగా ముగించకపోతే వేరే దర్యాపు అధికారిని ఎందుకు నియమించకూడదని వ్యాఖ్యానించింది.
Punjab: పంజాబ్ పోలీసులు, కేంద్రబలగాలు ఖలిస్తానీ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం జల్లెడ పడుతున్నాయి. గత రెండు రోజులుగా అతడి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన మద్దతుదారులు 78 మందిని లోపలేశారు. ఇదిలా ఉంటే కొంతమంది కెనడా, యూకే సిక్కు ఎంపీలు మాత్రం పంజాబ్ పరిస్థితిపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. పంజాబ్ లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Kerala First Transgender Lawyer: కేరళలో మొదటి జెండర్ న్యాయవాదిగా పద్మాలక్ష్మీ చరిత్ర సృష్టించారు. కేరళ రాష్ట్ర బార్ కౌన్సిల్ లో లాయర్ గా తమ పేరును నమోదు చేయించుకున్నారు. దీనిపై కేరళ మంత్రి పీ రాజీవ్ స్పందించారు. అనేక మంది ట్రాన్స్ జంటర్లకు పద్మాలక్ష్మీ ప్రేరణగా నిలుస్తారని ఆయన అన్నారు. మంత్రి ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ లో పద్మాలక్ష్మీని అభినందిస్తూ పోస్ట్ చేశారు. బార్ ఎన్ బార్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ కోసం బార్ కౌన్సిల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న 1500 మందిలో పద్మాలక్ష్మీ కూడా…
CJI D.Y. Chandrachud: లివ్ ఇన్ రిలేషన్ షిప్ పై దాఖలు చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్(పిల్)పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజీవనంలో ఉండే జంట రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే నిబంధనలు తేవాలని కోరతూ.. ఓ లాయర్ పిల్ దాఖలు చేశారు. సహజీవనం చేసే జంటలకు సామాజిక భద్రత కల్పించాలని కోరారు. దీని వల్ల లివ్ రిలేషన్ లో జరిగే నేరాలు తగ్గిపోతాయని పిటిషన్లో కోరారు.
Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా, దక్షిణ కొరియాలపై అణుదాడికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉత్తరకొరియా ప్రభుత్వ వార్త సంస్థ కేసీఎన్ఏ సోమవారం ఈ వ్యాఖ్యలను ధ్రువీకరించింది. ఉత్తరకొరియా సరిహద్దుల్లో అమెరికా, దక్షిణ కొరియాలు యుద్ధ విన్యాసాలు చేయడం, సైన్యాన్ని విస్తరించడాని కిమ్ తప్పుపట్టారు. ఇరు దేశాల నుంచి ఎదురయ్యే అణుదాడిని తిప్పికొట్టేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని కిమ్ జోంగ్ ఉన్ పిలుపునిచ్చారు.
Rahul Gandhi: ప్రధాని నరేంద్రమోదీతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డీల్ కుదర్చుకున్నారని, ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు ఆమె కాంగ్రెస్, రాహుల్ గాంధీ ప్రతిష్టను కంచపరుస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. మమతా బెనర్జీ ఈడీ, సీబీఐ దాడుల నుంచి తనని తాను రక్షించుకోవాలని అనుకుంటోందని అందుకే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ గురించి ఒక్కో విషయం బయటపడుతోంది. పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర ఇందులో దాగున్నట్లు తెలుస్తోంది. ఇతనికి పాక్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇతడికి సహాయకుడిగా ఉన్న ఢిల్లీ చెందిన దల్జీత్ కల్సికి పాక్ ఐఎస్ఐతో నేరుగా సంబంధాలు ఉన్నాయి.
Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు తెలిపాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడైన అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్ విస్తృతంగా వెతుకుతున్నాయి. పంజాబ్ సరిహద్దులను మూసేసి అతడిని పట్టుకునేందుకు రెండు రోజులు నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 78 మంది మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. సున్నిత ప్రాంతాల్లో బలగాలను మోహరించారు.
Asaduddin Owaisi: బీహార్ పర్యటనలో ఉన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. బీహార్ కిషన్ గంజ్ లో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తూ కేసీఆర్ పాలనను పొగిడారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన విలువైన పాలనను అందించారని అన్నారు. బీహార్ సీమాంచల్ ప్రాంతంలో పర్యటన ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.
Patna railway station incident: పాట్నా రైల్వేస్టేషన్ లో జుగుప్సాకరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో స్టేషన్ రద్దీగా ఉన్న సమయంలో ఏకంగా స్టేషన్ స్రీన్ పై మూడు నిమిషాల పాటు అశ్లీల వీడియో ప్లే అయింది. ఇది చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా ఇబ్బందికి గురయ్యారు. పాట్నా రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన టెలివిజన్ స్క్రీన్లపై ప్రకటనల స్థానంలో పోర్న్ క్లిప్ రావడంతో అన్ని రాష్ట్రాల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.