Elon Musk: డొనాల్డ్ ట్రంప్ ను అరెస్ట్ చేసి, ఆయనపై నేరాలు మోపితే 2024 అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయం సాధించడం ఖాయం అని ప్రపంచ టాప్-1 బిలియనీర్ ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. వచ్చే వారం ట్రంప్ పై అభియోగాలు మోపుతారనే వార్తలపై ఎలాన్ మస్క్ స్పందించారు. ఇదే జరిగితే ఆయన అద్భుత విజయం ఖాయమని అన్నారు.
Read Also: Khalistan: ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న “ఖలిస్తాన్”
ఈ నెల 21న తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తనలో లైంగిక సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన మహిళను డబ్బులో ప్రలోభపెట్టినట్లు వచ్చని అభియోగాలపై తనను అరెస్ట్ చేయవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తన సొంత సోషల్ మీడియా ‘‘ ట్రూల్ సోషల్’లో ఈ మేరకు శనివారం పోస్ట్ చేశారు. మాన్ హట్టన్ అటార్నీ ఆఫీస్ నుంచి తనకు సమాచారం ఉందని అన్నారు. రాజకీయంగా అవినీతిలో ఉందని మాన్ హట్టన్ అటార్నీ కార్యాలయంపై విమర్శలు గుప్పించారు. నెక్ట్స్ వారం తాను అరెస్ట్ చేయబడతానని, తన మద్దతుదారులు నిరసన తెలిపాలని సూచించారు. అమెరికాను మనం రక్షించాలని, మనం చూస్తూ కూర్చుంటే వారు దేశాన్ని చంపుతున్నారని డెమోక్రాట్లను విమర్శించారు. మాన్ హట్టన్ జిల్లా అటార్నీ కార్యాలయం ట్రంప్ పై అభియోగాలు మోపితే.. ఒక మాజీ అధ్యక్షుడిపై ఇలా అభియోగాలు మోపినట్లు అవుతుంది.
అయితే ఇప్పటి వరకు వచ్చినవి లీకులే అని, ఎటువంటి నోటిఫికేషన్ లేదని మాన్ హట్టన్ లోని లెఫ్ట్ డెమెక్రాట్ ప్రాసిక్యూటర్లు జార్జ్ సోరోస్ నిధులతో ఏ స్థాయికైనా వెళ్తున్నారని, ట్రంప్ ఈ వీకెండ్ లో టెక్సాస్ లో ఒక భారీ ర్యాలీ కోసం వస్తున్నారంటూ, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ రిపబ్లిక్ ప్రతినిధి అన్నారు.