PAN And Aadhaar Link: జూన్ 30 వరకు పాన్, ఆధార్ లింక్ గడువు పొడిగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAN And Aadhaar Link: కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డ్, ఆధార్ కార్డు లింకును పొడిగించింది. మార్చి 31 వరకు పాన్, ఆధార్ లింక్ చేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దాన్ని జూన్ 30 వరకు పొడిగించారు. ఇప్పటికే చాలాసార్లు కేంద్ర ఈ గడువును ఎక్సటెంట్ చేశారు. అయితే ఈ సారి గడువు ఉండదని ప్రకటించినప్పటికీ.. మరోసారి గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ప్రకారం.. తేదీని జూన్ 30, 2023 వరకు ఈ గడువును పొడిగించారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. పన్ను ఎగవేతను అరికట్టడానికి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం చాలా ముఖ్యం. పన్ను చెల్లింపుదారు రెండు డాక్యుమెంట్‌లను లింక్ చేయడంలో విఫలమైతే పాన్ కార్డు పనిచేయదు. పన్ను చెల్లింపుదారుడు తన ఆధార్ కార్డ్, పాన్ కార్డుతో జతచేయకుంటే జూలై1 నుంచి జరిమానా విధించే అవకాశం ఉంది.
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
Read Also: Atiq Ahmed: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు..
మే 2017లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, పాన్-ఆధార్ లింకింగ్ కొందరికి మినహాయింపు ఉంది.ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల నివాసితులకు మినహాయింపు ఉంది. 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం నాన్-రెసిడెంట్, 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, భారతదేశ పౌరుడు కాని వారికి మినహాయింపు ఉంది.
పాన్ కార్డుని ఆధార్ తో ఎలా లింక్ చేయాలంటే..
* ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించాలి eportal.incometax.gov.in లేదా incometaxindiaefiling.gov.in ని సంప్రదించాలి
*ఇప్పటికే రిజిస్టర్ చేయకుంటే మీ పాన్‌తో యూజర్ IDగా పోర్టల్‌లో నమోదు చేసుకోండి.
*పోర్టల్‌లోకి లాగిన్ అయి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి పాప్-అప్ విండో కనిపిస్తుంది. మెనూ బార్‌లోని ‘ప్రొఫైల్ సెట్టింగ్‌లు’కి వెళ్లి లింక్ ఆధార్‌పై క్లిక్ చేయాలి
*పాన్ కార్డ్ వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలు కనిపిస్తాయి
* ఆధార్‌లో ఉన్న మీ వ్యక్తిగత వివరాలను అందులో ధృవీకరించాలి. మీ వివరాలు సరిగ్గా ఉంటే.. ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, లింక్ నౌ బటన్‌పై క్లిక్ చేయండి.
* వీటితో పాటు https://www.utiitsl.com/, https://www.egov-nsdl.co.in/ ద్వారా కూడా లింక్ చేయవచ్చు
* లేదంటే… సమీపంలోని PAN సేవా కేంద్రాలను సందర్శించి నమోదు ప్రక్రియ పూర్తిచేయవచ్చు.
* మీకు ఏమైనా సాంకేతిక ఇబ్బందులు, సందేహాలు ఉంటే సమీపంలోని PAN సేవా కేంద్రాన్ని సందర్శించడం ద్వారా లింక్ చేసే ప్రక్రియను మాన్యువల్‌గా కూడా చేయవచ్చు. వెంటనే గడువు తేదీలోగా పాన్ కార్డుని ఆధార్ తో లింక్ చేయండి.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!