Pakistan Crisis: పాకిస్తాన్ తో ఆహార సంక్షోభం తీవ్రమవుతోంది. గోధుమ పిండి దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. కొందాం అన్నా కూడా గోధుమ పిండి అందుబాటులో లేకుండా పోయింది. ఉన్నా కూడా కిలోకు వందల్లో ధరలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోధుమ పిండితో లారీలు వెళ్తున్నాయంటే వాటిని వందలాది మంది పాకిస్తాన్ ప్రజలు వెంబడిస్తున్నారు. ట్రక్కుపై ఎక్కుతూ పిండిని దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో తెగ వైరల్ అవుతోంది.
Read Also: The Sun: సూర్యుడి ఉపరితలంపై భారీ రంధ్రం.. భూమికి ప్రమాదమా..?
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ తన ప్రజలుకు కనీసం నిత్యావసరాలు కూడా అందించలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు విదేశాలు, ఐఎంఎఫ్ సాయం కోరుతోంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియో పాకిస్తాన్ లో పరిస్థితి ఎలా ఉందో చెబుతోంది. బుర్ఖాలు ధరించిన మహిళలు, పిల్లలు ట్రక్కును వెంబడిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇటీవల రష్యా నుంచి వచ్చిన గోధుమలను రాత్రికి రాత్రే ప్రజలు, ప్రభుత్వ అధికారులు గోదాంల నుంచి దొంగిలించారు.
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ప్రభుత్వ పంపిణీ కేంద్రాల నుండి ఉచిత పిండిని సేకరించడానికి ప్రయత్నించిన కారణంగా గత కొన్ని రోజులుగా ఏర్పడిన సంక్షోభంలో నలుగురు మరణించారు. పంజాబ్ ప్రావిన్స్‌లో పేదల కోసం ఉచిత పిండి పథకాన్ని ప్రవేశపెట్టడంతో అనేక మంది ప్రజలు ప్రభుత్వ పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. పంజాబ్ తో పాటు ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్ మరియు బలూచిస్థాన్ ప్రావిన్సుల్లో కూడా ఇదే విధంగా గోధుమ కొరత ఏర్పడింది. ప్రస్తుతం గోధుమ ధరలు కరాచీలో కిలోకి రూ. 160 కాగా, ఇస్లామాబాద్, పెషావర్ 10 కిలోల పిండిని 1500 పాకిస్తాన్ రూపాయలుగా ఉంది.
Absolutely wild scenes from Pakistan where a massive crowd of people is chasing after wheat trucks. One truck almost runs over people. pic.twitter.com/hgP87XFyyT
— FJ (@Natsecjeff) March 29, 2023