Pakistan Economic Crisis: పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విదేశీ మారక నిల్వలు లేక ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకునేందుకు తంటాలు పడుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన మందుల కొరతతో అల్లాడుతోంది. పాకిస్తాన్‌లోని డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ యొక్క వివాదాస్పద ధరల విధానం మరియు క్షీణిస్తున్న స్థానిక కరెన్సీ కారణంగా ఇతర దేశాల నుంచి ఔషధాలను దిగుమతి చేసుకునేందుకు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో ప్రాణాలు కాపాడే మందుల కొరతను ఎదుర్కొంటోంది.
Read Also: Jewellery Robbery: దొంగల మాస్టర్ ప్లాన్.. ఏకంగా జువెలరీ షాప్‌లోకి సొరంగం.. భారీ దోపిడి..
పాకిస్తాన్ ఔషధ విధానం కూడా మందుల ధరల పెరుగుదల, కొరతను ఎదుర్కొంటోంది. డాలర్-రూపాయి వ్యత్యాసం కారణంగా విక్రేతలు తమ సరఫరాను నిలిపేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్లు, క్యాన్సర్ మందులు, సంతానోత్పత్తి మందులు, అనస్థీషియా గ్యాస్ కొరత ఎదుర్కొంటున్నాయి. సిరప్ లు, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు స్థానికంగా ఉత్పత్తి చేయబడుతున్నప్పటికీ, వ్యాక్సిన్లు, క్యాన్సర్ నిరోధక మందులను ఇండియా, రష్యా, చైనా, యూరప్, అమెరికా, టర్కీ నుంచి పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటోంది.
2019లో ఐఎంఎఫ్ ప్రతిపాదిత 6.5 బిలియన్ల బెయిలౌట్ ప్యాకేజీలో భాగంగా 1.1 బిలియన్ డాలర్ల కోసం పాకిస్తాన్ చూస్తోంది. అయితే ఐఎంఎఫ్ తీవ్రమైన కండిషన్స్ పెట్టింది. వీటన్నింటికి తలొగ్గిన పాక్ ఆ దేశంలో పన్నులు, కరెంట్, గ్యాస్, పెట్రోల్ ధరలను పెంచుతోంది. దీంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత వారం చైనా 500 మిలియన్ డాలర్లను రీఫైనాన్స్ చేయడంతో.. పాకిస్తాన్ విదేశీమారక నిల్వలు ప్రస్తుతం 4.8 బిలియన్లకు చేరుకున్నట్లు అంచనా.