ఏప్రిల్ 2025లో మార్కెట్లోకి బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. Samsung, Vivo, POCO, Motorola, Oppo వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఏప్రిల్ నెలలో కొత్త మొబైల్స్ ను విడుదల చేయబోతున్నాయి. రాబోయే ఫోన్లలో ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లతో పాటు బడ్జెట్ విభాగానికి చెందిన ఫోన్లు కూడా ఉన్నాయి. క్రేజీ ఫీచర్లు, స్టన్నింగ్ డిజైన్ తో మొబైల్ లవర్స్ ను ఆకట్టుకోనున్నాయి. ఏప్రిల్ నెలలో రాబోయే ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాం. Also Read:Vignesh Puthur: ఇంటర్నెట్ సంచలనంగా […]
క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని.. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్థాపానికి గురై గౌడవెల్లి గ్రామానికి చెందిన సోమేష్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సమస్య ఏదైనా సరే.. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు అని యువతకు సూచించారు. బెట్టింగ్ భూతాన్ని పూర్తిగా నిర్మూలించడానికి సజ్జనార్ అవిరామ కృషి చేస్తున్న విషయం తెలిసిందే. Also Read:FASTag: ఫాస్ట్ ట్యాగ్ వ్యవహారంపై హైకోర్టు […]
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ పదవీకాలాన్ని 2025 వర్షాకాల సమావేశాల చివరి వారం మొదటి రోజు వరకు పొడిగించే ప్రతిపాదనను లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ బిల్లు 2024 మరియు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు- 2024 పై లోక్‌సభలో నివేదిక సమర్పించడానికి సమయాన్ని పొడిగించాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) చైర్మన్ పిపి చౌదరి మంగళవారం ప్రతిపాదించారు. దీనిని సభ మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది. Also Read:Volkswagen: […]
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో యువత పెడదార్లు పడుతోంది. బెట్టింగ్ మాయలో పడి బంగారం లాంటి భవిష్యత్తును అంధకారం చేసుకుంటోంది. బెట్టింగ్ లో పెట్టింది తిరిగి వచ్చుడు దేవుడెరుగు ఉన్నదంతా ఊడ్చుకబోయి రోడ్డున పడుతున్నారు చాలామంది. అప్పులు తీర్చే మార్గం లేక తనువులు చాలిస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బుకోల్పోయిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి […]
ప్రోటీన్ శరీరానికి అవసరమైన పోషకం. ఇది కండరాలను నిర్మించడంలో, శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అందువల్ల ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలని సూచిస్తుంటారు నిపుణులు. అయితే గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుందని చెప్తుంటారు. కానీ కొన్ని కూరగాయలు (ప్రోటీన్-రిచ్ వెజిటేబుల్స్) గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటాయని మీకు తెలుసా? ఈ కూరగాయలు ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉండటమే కాకుండా, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉన్న […]
కార్ లవర్స్ కు మరో కొత్త కారు అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ వోక్స్ వ్యాగన్ త్వరలో భారత మార్కెట్లో కొత్త SUV వోక్స్వ్యాగన్ టిగువాన్ R-లైన్‌ను విడుదల చేయనుంది. లాంచ్ కు ముందు SUV ఇంజిన్, పవర్, ఫీచర్లు, డిజైన్ కు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ఈ SUV ని విడుదల చేయడానికి ముందు కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఇంజిన్‌కు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది. సమాచారం ప్రకారం ఈ SUV రెండు లీటర్ల సామర్థ్యం […]
రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేద్రప్రసాద్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్, డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి, “రేయ్ డేవిడ్, వచ్చి క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప స్టెప్పులు వేస్తావా, దొంగ ము** కొడకా, నువ్వు మామూలోడివి కాదు రోయ్ వార్నరూ” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా […]
ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? మీ క్వాలిఫికేషన్ కు తగిన జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ – సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR-CRRI) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీచేయనున్నారు. మొత్తం 209 పోస్టులు […]
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 25, 26 తేదీల్లో కలెక్టర్ సమావేశాలు జరుగనున్నాయి. రేపటి నుంచి రెండు రోజులపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరుగనున్నది. రేపు ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభంకానుంది. ఉదయం 10 గంటలకు సీసీఎల్ఏ ప్రారంభ ఉపన్యాసం జరుగనుంది. ఆ తర్వాత సీఎస్.. రెవెన్యు మంత్రి.. ఆర్ధిక మంత్రి ప్రసంగాలు ఉండనున్నాయి. Also Read:Rishabh Pant: రూ. 27 కోట్లు గంగలో కలిసినట్లేనా..? రిషబ్ పంత్ ప్లాప్ షో! తర్వాత […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఉద్యోగ కల్పనపై దృష్టిసారించింది. ఓ వైపు ప్రభుత్వ శాఖల్లోని జాబ్స్ ను భర్తీచేస్తూనే మరోవైపు పరశ్రమలను, పెట్టుబడులను తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు అందించేందుకు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం భేటి అయింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. ఉద్యోగాల కల్పనలో ఉన్న ప్రతి అడ్డంకి తొలగించాలని మంత్రి నారా […]