చరిత్రలో మరిచిపోలేని విషాదకరమైన రోజు. 242 ప్రయాణికులతో గాల్లోకి ఎగిరిన ఎయిర్ ఇండియా విమానం నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. మేఘనినగర్ సమీపంలో ఓ మెడికల్ కాలేజీ భవనంపై క్రాష్ అయ్యింది. క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 242 మంది మృతి చెందినట్లు సమాచారం. విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారని.. విమానంలో ఉన్నవారెవరూ బతికిఉండే అవకాశమే లేదని అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ తెలిపారు.
Also Read:Ahmedabad plane crash: “ఇంజన్ థ్రస్ట్ కోల్పోవడం”.. ఎయిరిండియా విమాన ప్రమాదానికి కారణాలు ఇవేనా..?
అహ్మదాబాద్ విమాన ప్రమాదం మృతుల్లో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. 230 మంది మృతుల్లో 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్ పౌరులు, ఒకరు కెనడా దేశస్థుడు ఉన్నారు. మృతుల్లో 217 మంది పెద్దవారు, 11 మంది పిల్లలు, ఇద్దరు పసివాళ్లు. విమాన ప్రమాదంలో 169 మంది భారతీయులు మృతి చెందారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై గుజరాత్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మాజీ సీఎం విజయ్ రూపానీ సహా విమానంలో 242 మంది మృతి చెందినట్లు వెల్లడించింది.