ఎయిర్ ఇండియా విమానం AI171 దుర్ఘటన వందలాది మంది కుటుంబాల్లో విషాదం నింపింది. టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తు్న్న వారు 240 మంది మృతిచెందారు. పెను విషాదం చోటుచేసుకోవడంతో ప్రపంచ లీడర్లు సంతాపం ప్రకటిస్తు్న్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అహ్మదాబాద్ లో పర్యటించారు. విమాన ప్రమాదంలో గాయపడ్డవారిని పరామర్శించారు.
Also Read:Allu Arjun: మలయాళ సెన్సేషన్ తో బన్నీ సినిమా?
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికుడిని కలిశా.. డీఎన్‌ఏ టెస్టుల తర్వాతే మృతుల సంఖ్యపై ప్రకటన చేస్తాం.. విమానం పేలడంతో ప్రయాణికులకు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.. ప్రయాణికుల మృతదేహాలను వెలికి తీసే పని పూర్తయింది.. వెయ్యికి పైగా డీఎన్‌ఏ టెస్టులు చేయాల్సి ఉంటుంది.. గుజరాత్‌లోనే వీలైనంత త్వరగా డీఎన్‌ఏ టెస్టులు పూర్తి చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరపున ఆయన సంతాపం తెలిపారు.