టమాటా అనేక రకాల వంటలలో ఉపయోగించే ఒక కూరగాయ. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా, దానిలో ఉండే పోషకాలు కూడా శరీరానికి మేలు చేస్తాయి. టమాటాలలో విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే, టమాటాలు తినడం కొంతమందికి హానికరం కావొచ్చు. ఆ వ్యాధులతో బాధపడే వారు వీటికి దూరంగా ఉండడమే మంచిదంటున్నారు నిపుణులు. Also Read:Drunken Drive […]
క్రికెట్ ప్రియులను అలరించేందుకు వైజాగ్ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది. మరికాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ ప్రారంభంకాబోతోంది. ఈ మ్యాచ్ సందర్భంగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా ఏసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. వైజాగ్ క్రికెట్ స్టేడియంలో 30 మంది అనాథ చిన్నారులకు ఐపీఎల్ మ్యాచ్ చూసే అవకాశం కల్పించింది ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్. ఏసీఏ తన సొంత నిధులతో 30 టికెట్స్ కొని వైజాగ్ […]
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో స్కీములు లేవని.. అన్నీ స్కాములు మాత్రమే ఉన్నాయని అన్నారు. అమరావతి నుంచి హంద్రినీవా దాకా అంతా అవినీతే తాండవిస్తోందని తెలిపారు. కాంట్రాక్టు సంస్థలు రింగ్ అవుతున్నాయి, దీనివల్ల సమయం, ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్నారు. ప్రశ్నిస్తామని చెప్పిన వాళ్ళు ఎక్కడున్నారో తెలియడం లేదంటు మండిపడ్డారు. దేశంలోనే అత్యుత్తమ కాంట్రాక్టు విధానాన్ని జగన్ తీసుకొచ్చారు. జ్యూడిషియల్ ప్రివ్యూతో పాటు రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు […]
గతకొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని బలభద్రపురం గ్రామం హాట్ టాపిక్ గా మారింది. పదుల సంఖ్యంలో అక్కడి ప్రజలు క్యాన్సర్ భారిన పడడంతో తీవ్రకలకలం రేగింది. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం ఇంటింటి సర్వే చేస్తూ వైద్య సేవలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించింది. తాజాగా వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కొంత కాలంగా జరుతున్నాయన్నారు. ఇప్పటికే నాలుగు లక్షల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష లు నిర్వహించామని తెలిపారు. […]
పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్షిప్ పీ4 పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీ4 విధానానికి తుదిరూపు ఇచ్చారు. ఉగాది సందర్భంగా అమరావతిలో పీ4 ప్రారంభం అవుతుందని సీఎం వెల్లడించారు. సాయం అందించే చేతులకు వేదిక పీ4 అన్నారు. సంపన్నులు – పేదలను ఒకేచోటుకు చేర్చడమే దీని లక్ష్యమని తెలిపారు. ఎన్నారైలతో సహా స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకురావొచ్చని కోరారు. పేదలకు అండగా నిలిచేవారు ‘మార్గదర్శి’ – లబ్ధి పొందేది ‘బంగారు కుటుంబం అని సీఎం […]
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్యక్షతన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ. 5258 కోట్ల రూపాయల అంచనాతో టీటీడీ వార్షిక బడ్జెట్కు పాలకమండలి ఆమోదం తెలిపింది. హుండీ ద్వారా రూ. 1,729 కోట్లు ఆదాయం లభిస్తూందని పాలక మండలి అంచనా వేసింది. వడ్డీల ద్వారా రూ. 1,310 కోట్లు ఆదాయం లభిస్తూందని అంచనా వేశారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 600 కోట్లు, దర్శన టిక్కెట్ల […]
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులకు గుడ్ న్యూస్ అందించింది. ఎంపీలకు అందించే వేతనాలు, పెన్షన్లను కేంద్రం పెంచింది. ఎంపీల జీతాలలో భారీ పెరుగుదల ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ఎంపీలకు నెలకు రూ.1 లక్ష 24 వేలు జీతం లభిస్తుంది. ఇది గతంలో రూ.1 లక్ష. ఇది కాకుండా రోజువారీ భత్యాన్ని కూడా రూ.2 వేల నుంచి రూ.2500కు పెంచారు. మాజీ ఎంపీల పెన్షన్ కూడా పెంచారు. నెలకు రూ.25 వేల నుంచి రూ.31 వేలకు పెంచారు. ఈ […]
చౌక ధరలో క్రేజీ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ కారును కొనాలనుకుంటున్నారా? అయితే అదిరిపోయే ఈవీ మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఇటీవల JSW MG మోటార్ ఇండియా భారత మార్కెట్లో తన చౌకైన ఎలక్ట్రిక్ కారు MG కామెట్ EV ని విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 4.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో కిలోమీటరుకు రూ. 2.5 చొప్పున బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BAAS) ఎంపిక కూడా ఉంది. Also Read:Akbaruddin Owaisi : […]
రైల్వే ఉద్యోగాలకు హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. రైల్వే జాబ్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మీరు కూడా రైల్వేలో కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ పలు జోనల్ రైల్వేలలో భారీగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 9,970 పోస్టులను భర్తీచేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో 989 పోస్టులు భర్తీకానున్నాయి. Also Read:MLC Kavitha : […]
డిజిటల్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక ఏటీఎంలకు వెళ్లేవారి సంఖ్య కాస్త తగ్గిందనే చెప్పాలి. అయినప్పటికీ చాలామంది ఏటీఎం సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే బ్యాంక్ కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. ఆర్బీఐ ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజుల పెంపుకు ఆమోదం తెలిపింది. ఆర్థిక లావాదేవీలకు రూ.2, ఆర్థికేతర లావాదేవీలకు రూ.1 చొప్పున ఛార్జీలను పెంచింది. మే 1 నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఛార్జీల పెంపు పరిమిత ఏటీఎం నెట్వర్క్ కలిగిన చిన్న బ్యాంకులపై […]