ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ షాపులు, ఏజెన్సీలపై డ్రగ్ ఇన్స్పెక్టర్లు, విజిలెన్స్, పోలీస్ అధికారులు దాడులు నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మెడికల్ ఏజెన్సీలు మందుల షాపులపై విజిలెన్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఈగల్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. మందుల నాణ్యత, రికార్డులను అధికారులు పరిశీలించారు. విజిలెన్స్ ఎస్పీ ఎం.స్నేహిత, డ్రగ్స్ ఏడి నాగమణి రాజమండ్రి తిరుమల శ్రీనివాస్ మెడికల్ ఏజెన్సీలో ఆకస్మిక తనిఖీలు చేశారు. మెడికల్ గా ఒకే మోతాదులో వినియోగించే సిరఫ్, ఇంజక్షన్లు మత్తు మందులను […]
ఉద్యోగాల కోసం వెతుకుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్లో మేనేజర్ పోస్టులను భర్తీచేయనున్నది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా సీనియర్ మేనేజర్ (లీగల్/ఎలక్ట్రిక్/సివిల్), మేనేజర్ గ్రేడ్ 1 (లీగల్/ఎలక్ట్రికల్/సివిల్), మేనేజర్ గ్రేడ్ 2 (మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్), అసిస్టెంట్ మేనేజర్ (లీగల్/ఫైనాన్స్/మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. Also Read:Vidadala Rajini అందుకే గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశా: విడదల రజని పోస్టులను […]
విశాఖ స్టేడియం పేరు మార్పు వివాదంపై వైసీపీకి టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. క్రీడలను రాజకీయాలను ముడి పెట్టొద్దన్నారు. స్టేడియానికి 30 ఏళ్లుగా ఉన్న పేరే ఉంది.. మేం ఏ పేరు మార్చలేదని స్పష్టం చేశారు. రాజకీయం చేయటం కోసమే వైసీపీ ఇదంతా చేస్తోందని విమర్శించారు. ఎందుకు వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారో వారికే తెలియాలన్నారు. విశాఖ ప్రతిష్ఠ పెంచేలా కూటమి ప్రభుత్వం కష్టపడి మ్యాచ్ లు […]
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గత ప్రభుత్వ హయాంలో పొలిటికల్ ఉద్యోగాలు అందించేలా సలహాదారు నియామకాలు జరిగేవి. కానీ, కూటమి ప్రభుత్వం పలు రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికీ మాత్రమే సలహాదారుగా నియమించారు. ఏపీకి 7 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేలా కూటమి కృషి చేస్తోంది. త్వరలో విశాఖ, విజయవాడలో మెట్రో రాబోతోంది. 11 పట్టణాలకు 750 ఎలక్ట్రిక్ బస్సులు కేంద్రం సహకారంతో తెస్తున్నామని వెల్లడించారు. […]
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆక్టోపస్ మాక్ డ్రిల్ నిర్వహించింది. ఆలయ అధికారులు పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులతో ఆక్టోపస్ నిర్వహించారు. దుర్గగుడిపై పటిష్ట చర్యలు తీసుకోవాలని ఈ నెల19,20 తారీకుల్లో దుర్గగుడిపై ఆక్టోపస్ టీమ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భద్రతా చర్యలపై ఆక్టోపస్ టీమ్ వేలెత్తిచూపింది. లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయంలో ఏదైనా ప్రమాదం జరిగితే అటు భక్తులకు గాని, ఇటు సిబ్బందిని గాని హెచ్చరించడానికి సైరాన్ సౌకర్యం లేదని గుర్తించింది. ఆలయంలోకి […]
కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత సంజన్న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 14న శరీన్ నగర్ లో దారుణ హత్యకు గురయ్యారు. రాజకీయ ఆధిపత్య పోరు హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా కర్నూలులో టీడీపీ నేత సంజన్న హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు మందిని అరెస్ట్ చేశారు. వద్దే రామాంజనేయులు, రేవంత్, తులసి, శివకుమార్, […]
రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మానవతప్పిదాలు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో ప్రమాదాలకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పెనుగొండ కియా ఫ్యాక్టరీ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. Also Read:IPL 2025 […]
బాధ్యతగా ఉండాల్సిన ఆలయ సిబ్బంది తప్పటడుగులు వేశారు. దేవాలయంలో దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. ఉరవకొండ మండలం పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఓ భక్తురాలు హుండీలో వేసిన నగలు మాయం చేశారని ఆలయ సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి. అమిద్యాలకు చెందిన రంగయ్య, వనజాక్షి దంపతులు మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి తాళిబొట్టు గొలుసు, ముక్కుపుడక, చెవి కమ్మలు, వెండి పట్టీలు మూటగట్టి వనజాక్షి హుండీలో వేసింది. […]
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ షాకిచ్చిన బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. ఇవాళ వెండి ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. నేడు తులం బంగారంపై రూ. 440 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,022, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,270 వద్ద ట్రేడ్ అవుతోంది. […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలకు వెళ్లారు. పద్మావతి అతిధి గృహం నుంచి కుటుంబంతో కలిసి శ్రీవారి ఆలయానికి భయలుదేరి, కుటుంబ సమేతంగా ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఇఓ శ్యామలరావు, అదనపు ఇఓ వెంకయ్య చౌదరి సీఎం చంద్రబాబుుకు స్వాగతం పలికారు. మంగళవాయుద్యాలు.. వేదమంత్రోచ్చారణల మధ్య మనవడు దేవాన్ష్ తో కలిసి ఆలయ ప్రవేశం చేశారు. చంద్రబాబు కుటుంబసభ్యులను ప్రధాన అర్చకులు ఆశ్వీరదించారు. Also Read:Pakistan: పాక్లో ఎన్కౌంటర్.. ఆర్మీ కెప్టెన్ సహా 10 మంది ఉగ్రవాదుల […]