పశ్చిమ సూడాన్‌లోని ఉత్తర డార్ఫర్ రాష్ట్ర రాజధాని ఎల్ ఫాషర్లో గత రెండు రోజుల్లో రెండు శిబిరాలపై పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 114 మందికి పైగా పౌరులు మరణించారు. ఏప్రిల్ 12న జామ్జామ్ శిబిరంపై ఆర్ఎస్ఎఫ్ మిలీషియా జరిపిన దారుణ దాడిలో 100 మందికి పైగా పౌరులు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు ని నార్త్ డార్ఫర్ రాష్ట్ర ఆరోగ్య అథారిటీ డైరెక్టర్ జనరల్ ఇబ్రహీం ఖైటర్ జిన్హువా […]
అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ అధికారుల పనితీరుపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ అనేది చాలా కీలకమైనది.. ముఖ్యంగా రెవిన్యూలో ఎవరు చేయలేనిది ఓన్లీ రెవిన్యూ సిబ్బంది మాత్రమే చేయగలుగుతారు.. ఎమ్మార్వో స్థాయి నుండి కలెక్టర్ స్థాయి వరకు బాగానే పనిచేస్తున్నారు.. కానీ కింద స్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు.. నేను ఒక ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నా.. మంత్రిగా కాదు.. జిల్లాలోని ప్రతి […]
సిద్దార్ధ వైద్య కళాశాలల్లో మళ్ళీ ఎంబీబీఎస్ విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ కలకలం రేపింది. గత బుధవారం జనరల్ మెడిసిన్ పరీక్ష రాస్తూ పట్టుబడ్డ ముగ్గురు విద్యార్ధులు. శనివారం కమ్యూనిటీ మెడిసిన్ (పార్ట్ 1) పరీక్ష రాస్తూ ఇద్దరు విద్యార్ధులు పట్టుబడ్డారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన విద్యార్దులను ఎన్నారై, నిమ్రా కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. 160 మంది విద్యార్దులు పరీక్ష రాస్తుండగా ఇద్దరు పట్టుబడ్డారు. Also Read:Anupama : ఆ రెండు విషయాల్లో మాత్రం ఒత్తిడికి గురవుతా.. […]
వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో 12మంది పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐ టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు తీసుకొస్తున్న సమయంలో గోరంట్ల మాధవ్ పోలీస్ కాన్వాయ్ ను వెంబడించడం, గుంటూరు చుట్టగుంట సెంటర్ లో కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. ఎస్పీ కార్యాలయంలోకి గోరంట్ల మాధవ్, అతని అనుచరులు రావడంతో వారిని అదుపులోకి […]
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పరిగి మండలం ధనాపురం సమీపంలో ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా పొడికొండ సిరా 544 జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. Also Read:Pawan Kalyan: మార్క్ శంకర్ తో ఇండియాకు తిరిగొచ్చిన పవన్ […]
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రినన్న విషయం మరిచి విద్యుత్ షాక్ తో మృతి చెందిన కొడుకు మృత దేహాన్ని నదిలో పడేశాడు. సిర్పూర్ టి మండలం టోంకిని కి చెందిన జయేందర్( 19 ) పంట చేనుకు వేసిన విద్యుత్ కంచె (ఫెన్సింగ్ )తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే నేరం తనమీదకు వస్తుందని భయాందోళనకు గురైన తండ్రి మృత దేహాన్ని పెనుగంగ నదిలో పడేశాడు. ఆ తర్వాత కుమారుడు కనిపించడం […]
అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. న్యూయార్క్‌లో మరోసారి విమాన ప్రమాదం సంభవించింది. న్యూయార్క్‌లో ఒక చిన్న విమానం కూలిపోవడంతో ఒకరు మరణించారు. అయితే, ఈ విమాన ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారో ఇంకా స్పష్టంగా తెలియలేదు. న్యూయార్క్ రాష్ట్ర రాజధాని అల్బానీకి దక్షిణంగా శనివారం మధ్యాహ్నం ఆరుగురు వ్యక్తులతో వెళ్తున్న ఒక చిన్న విమానం కూలిపోయి, ఒకరు మృతి చెందారని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, పోలీసులు తెలిపారు. Also Read:Prabhas : ‘స్పిరిట్’ మూవీ […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా జరిగిన 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 247/2 స్కోరు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో హీరో ఓపెనర్ అభిషేక్ శర్మ. అభిషేక్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ కింగ్స్‌ను ఓడించాడు. సన్ రైజర్స్ […]
కొన్ని సందర్భాల్లో రీల్ సీన్స్ రియల్ సీన్స్ గా మారినప్పుడు ఆశ్చర్యపోవడం తప్పనిసరి అవుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. 2014లో 19 ఏళ్ళ వయసులో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ యువకుడు 11 ఏళ్ల తర్వాత తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరాడు. కనిపోయించకుండా పోయిన కుమారుడు తమ చెంతకు చేరడంతో తల్లిదండ్రుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. 11 ఏళ్ల క్రితం కనిపోయించకుండా పోయిన కుమారుడిని మెదక్ జిల్లా […]
జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్ రెడ్డి నాపై ఆధారాలు లేని ఆరోపణలు చేసి ప్రజల్లో నా పలుకుబడి గుర్తింపును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుండు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపణలను, విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాను.. పదే పదే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయాలి అంటున్నాడు.. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉంది, సుప్రీం కోర్టు […]