రాజా రఘువంశీని హనీమూన్ పేరిట మేఘాలయకు తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా చంపిన సోనమ్ రఘువంశీ తీరు యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సోనమ్ ను కఠినంగా శిక్షించాలని మహిళాలోకం ముక్తకంఠంతో నినదించింది. ఇంకా ఆ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో సోనమ్ రఘువంశీకి పిండదానం చేశారు మహిళలు. వారణాసిలో పిండదానం చేసి ఆమె ఫోటోను దహనం చేశారు. సోనమ్‌ను సమాజం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఆమె భర్త రాజా రఘువంశీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సోనమ్ చర్యను మహిళా వ్యాపార మండలి ఖండించింది.
Also Read: TamannaahBhatia : పాల లాంటి తెలుపురంగులో మెరుస్తున్న తమ్ము
బుధవారం నాడు కొంతమంది మహిళలు దశాశ్వమేధ ఘాట్ చేరుకుని పూజారిని కలిసి, హనీమూన్ సమయంలో తన భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండోర్ నివాసి సోనమ్ రఘువంశీకి పిండదాన కర్మను నిర్వహించారు. పిండదానం చేసిన తర్వాత ఆమె చిత్రపటాన్ని గంగానదిలో ముంచడానికి బదులుగా, దానిని దహనం చేశారు. ఆమె చేసిన పనికి ఆమెకు నరకంలో కూడా స్థానం లభించదని మహిళలు అన్నారు.
Also Read:Mali-India: మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్.. చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్
ఆమె భర్త రాజా రఘువంశీకి మహిళలు పిండదానాన్ని అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించారు. సోనమ్ చర్య కారణంగా, ప్రతి స్త్రీని అనుమానంగా చూస్తున్నారని మహిళా వ్యాపార మండలి అధ్యక్షురాలు సునీతా సోని అన్నారు. సోనమ్ మహిళలకు ఓ మచ్చ తెచ్చిపెట్టింది. మొత్తం స్త్రీ జాతిని కళంకం చేసిన అలాంటి స్త్రీని మేము బహిష్కరిస్తున్నాము. అలాంటి మహిళలకు సమాజంలో జీవించే హక్కు లేదని మండిపడింది.