42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్టరూపం తీసుకురావాలని.. అప్పటి వరకు బీసీ బిల్లు కోసం బీఆర్ఎస్ బరాబర్ కొట్లాడుతదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కవిత మాట్లాడుతూ.. బీసీ బిల్లు తీసుకు రావాలని కేంద్రం పై ఒత్తిడి తెస్తున్నాం.. అందుకోసం జులై 17 న రైలు రోకో చేయబోతున్నాం.. రైలు రోకోకు మద్దతు ఇవ్వమని కొన్ని పార్టీ లను కలిశాం.. బీజేపీ బీసీ బిల్ పెట్టె విదంగా చేయాలని కొత్తగా ఎన్నికైన రామచందర్ రావు కు లేఖ రాశాము.. ఈ రోజు కాంగ్రెస్ అద్యక్షుడు ఖర్గే హైదరాబాద్ వస్తున్నారు.. ఖర్గే కు లేఖ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.. కేంద్రం పై ఒత్తిడి తేవాలని ఖర్గే ను కోరుతున్నాం.. ప్రభుత్వం కులగణన చేసిన వివరాలు బయట పెట్టమని డిమాండ్ చేస్తున్నామన తెలిపారు.
Also Read:India-US: 48 గంటల్లో భారత్-యూఎస్ మధ్య కీలక డీల్ జరిగే ఛాన్స్!
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏమి తేల్చిందో వివరాలు బయట పెట్టాలి.. రైలు రోకో కు మద్దతు ఇవ్వాలని బీసీ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.. డెక్కన్ నుంచి ఢిల్లీ వెళ్లే ప్రతి రైలు ను ఆపుదాం.. ఢిల్లీ కి మన గొంతు వినిపించేలా చేద్దాం.. కలిసి వచ్చే అన్ని ప్రజా సంఘాలను ఆహ్వానిస్తున్నాం.. జులై 8 న ఢిల్లీ వెళ్తున్నాం.. అక్కడ ప్రెస్ మీట్ పెట్టి కేంద్రాన్ని బీసీ బిల్లు పై అడుగుతాం.. బనకచర్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్ల కోసం కట్టే ప్రాజెక్టు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్పారు.. ఇప్పటి కైనా సీఎం కళ్ళు తెరిచి బనకచర్ల ఆపే విదంగా కొట్లాడాలి అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.