కొండా మురళి.. సొంత పార్టీ నేతలని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను పరోక్షంగా విమర్శించారు. దీంతో ఆయే నేతలు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో నేడు మంత్రి కొండా సురేఖ, మురళీ కాంగ్రెస్ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో భేటి అయ్యారు. తన వ్యాఖ్యలపై ఇంచార్జీ కి వివరణ ఇచ్చారు. ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కి 16 పేజీల లేఖ సమర్పించారు.
Also Read:Chevireddy Bhaskar Reddy: జైలు వద్ద ఆగని చెవిరెడ్డి హంగామా.. మూల్యం తప్పదు అంటూ..!
కొండా మురళి లేఖలో.. నేను వెనకబడిన వర్గాల ప్రతినిధిని.. నలభై నాలుగు ఏండ్ల నుంచి నా ఎపిసోడ్ నడుస్తూనే ఉంది.. ఒకరి గురించి నేను కామెంట్ చేయను.. నాకు ప్రజాబలం ఉంది.. నాకు భయపడకపోతే నాపై 23 కేసులు పెట్టకపోయేవాళ్ళు.. పోటా, టడా కేసులకే నేను భయపడలేదు.. నాకు భయం లేదని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను.. ఈ వ్యవహారం క్రమశిక్షణ కమిటి పరిధిలో ఉన్నది.. అయినా నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు.. నాయిని రాజేందర్ రెడ్డి చేసిన బొంగెం కాదు అనే వ్యాఖ్యలను ఇంచార్జి దృష్టికి తీసుకెళ్లారు కొండా దంపతులు.
Also Read:Fire Accident: గోవిందరాజస్వామి ఆలయం వద్ద భారీ అగ్ని ప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం!
కొండా మురళీ మాట్లాడుతూ.. రేపు జరగబోయే మీటింగ్ పై చర్చించాం.. రేపు వరంగల్ నుంచి ఎంత మంది వస్తారు అనేది చర్చించాం.. కాంగ్రెస్ పార్టీ నీ బ్రతికించడం నా ఉద్దేశం.. రాహుల్ గాంధీ నీ ప్రధాని చేయడం నా ఉద్దేశం.. పని చేసే వాళ్లపైనే రాళ్ళు విసురుతారు.. లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని కాంగ్రెస్ గెలిచేలా.. ఎమ్మెల్యేలను మళ్ళీ వరంగల్ లో గెలిపించడం నా బాధ్యత.. నేను ఎవ్వడికి భయపడేది లేదు.. నేను బీసీ కార్డు పైనే బ్రతుకుతున్నాను.. రోజు 500 మంది ప్రజలకు భోజనం పెడతాను.. ప్రజల సమస్యలు తీర్చేందుకు ముందు ఉంటాను కాబట్టి ప్రజలు వస్తున్నారు.. ఎలాంటి గ్రూప్ రాజకీయాలతో నాకు సంబంధం లేదు.. నా కూతురు ఎక్కడి నుంచి పోటీ చేయడం లేదు.. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది.. మా కూతురు అనుకునేది నాకు తెలియదు.. మా కూతురు తొందర పడి అన్నదో.. ఆలోచించి అన్నదో నాకు తెలియదని అన్నారు.
Also Read:Sivaganga Custodial Death: లాకప్ డెత్‌ను షూట్ చేసిన వ్యక్తికి బెదిరింపులు.. డీజీపీకి ఫిర్యాదు
కొండా సురేఖ మాట్లాడుతూ.. నా కూతురు పరకాల నుంచి పోటీ చేస్తా అని చెప్పడంలో తప్పు లేదు.. టికెట్ ఆశిస్తున్నది తను.. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం.. కొండా మురళీ సురేఖ దంపతులకు వారసురాలు నా కూతురు.. తన భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించే అవకాశం తనకి ఉంది.. తన ఆలోచనను మేము కాదనలేం.. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూస్తామని తెలిపారు.