Veerababu Burugadda
Author- NTV Telugu-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
లక్నో వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 170 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. గతేడాది రోహిత్ శర్మ నుండి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, శుభ్‌మన్ గిల్‌కు ఇది తొలి సిరీస్ విజయం కావడం విశేషం. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్, గిల్ (154 పరుగులు, 110 బంతులు) అద్భుతమైన శతకంతో నిర్ణీత ఓవర్లలో 402 పరుగుల […] -
IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్‌గా యువరాజ్ సింగ్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. భారత క్రికెట్ దిగ్గజం, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఐపీఎల్లో తన మొదటి కోచింగ్ బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ సహాయక సిబ్బందిలో యువరాజ్ సింగ్ చేరనున్నారని, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా మళ్లీ జట్టులోకి రాబోతున్నారని సమాచారం. ఫ్రాంచైజీ నిర్వహణ బాధ్యతలను జేఎస్‌డబ్ల్యూ (JSW) గ్రూప్ చేజిక్కించుకోనుండటంతో ఈ మార్పులు ఊపందుకున్నాయి. […] -
Ind Vs Afg: ఆఫ్ఘనిస్తాన్పై 170 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం..
లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 170 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌట్ అయింది. వన్డే క్రికెట్ చరిత్రలో భారత జట్టు 400 పరుగుల మార్కును దాటడం ఇది ఎనిమిదో సారి. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) త్వరగానే అవుటైనప్పటికీ.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 48) గిల్‌తో కలిసి […] -
Vaibhav And Tilak Varma: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీకి భారీ జరిమానా, కెప్టెన్ తిలక్ వర్మపై నిషేధం..
శ్రీలంకలోని దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర వివాదానికి దారితీసింది. లంక ఆటగాడు విషేన్ హలాంబెజ్‌తో మైదానంలో చోటుచేసుకున్న నెట్టులాట, వాగ్వాదం కారణంగా భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీపై మ్యాచ్ ఫీజులో 50 శాతం భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా, జట్టు క్రమశిక్షణను సక్రమంగా నిర్వహించలేకపోయినందుకు గానూ భారత కెప్టెన్ తిలక్ వర్మపై మరింత కఠిన చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. తిలక్ వర్మపై మ్యాచ్ ఫీజులో […] -
Ind Vs Ned: పసికూన నెదర్లాండ్‌పై భారీ స్కోర్.. విధ్వంసం స్పష్టించిన ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ..
మహిళల టీ-20 ప్రపంచ కప్ 2026లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తన రెండో గ్రూప్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు నెదర్లాండ్‌పై అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో విరుచుకుపడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు 200 పరుగుల మార్కును అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. భారత ఓపెనర్లు స్మృతి […] -
Shubman Gill: కోచ్ రికార్డునే బ్రేక్ చేసిన శిష్యుడు.. సెంచరీల్లో శుభమన్ గిల్ సరికొత్త రికార్డు..
శుభమన్ గిల్ కెప్టెన్‌గా అఫ్గానిస్తాన్‌తో లక్నోలోని ఇటానా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగారు. కేవలం 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేశారు. వన్డేల్లో కెప్టెన్‌గా గిల్‌కు ఇది తొలి శతకం కాగా, మొత్తంగా వన్డేల్లో 9వ శతకం. అంతర్జాతీయ క్రికెట్లో ఇది ఆయనకు 21వ సెంచరీ. ఇందులో 11 టెస్టులు, 1 టీ20 శతకం ఉన్నాయి. భారత్ తరఫున ఇప్పటివరకు 140 మ్యాచ్‌లు ఆడిన గిల్, […] -
Rohit Sharma: సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ.. 14 వేల క్లబ్‌లోకి చేరిన ఐదో భారతీయుడు..
భారత బ్యాటింగ్ దిగ్గజం, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ లిస్ట్-A క్రికెట్లో 14,000 పరుగుల మైలురాయిని అధిగమించి, ఈ ఘనత సాధించిన ఐదో భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఫామ్‌లో కనిపించిన అతను 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 123కు పైగా స్ట్రైక్ రేట్‌తో 48 పరుగులు చేశాడు. ప్రస్తుతం రోహిత్ పేరిట 356 లిస్ట్-A మ్యాచ్‌ల్లో 37 […] -
Vaibhav Sooryavanshi: ఫీల్డింగ్‌పై విమర్శలా? అయితే ఈ క్యాచ్ చూడండి.. వైభవ్ సూర్యవంశీ అద్భుతం..
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ నైపుణ్యం గురించి క్రికెట్ ప్రపంచమంతటికీ బాగా తెలుసు. క్రీజులోకి వస్తే కేవలం కొన్ని ఓవర్లలోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల అద్భుతమైన సామర్థ్యం అతని సొంతం. అయితే, బ్యాటింగ్‌లో ఎంతటి గుర్తింపు తెచ్చుకున్నా, అతని ఫీల్డింగ్ విషయానికొచ్చేసరికి ఎప్పుడూ కొన్ని సందేహాలు, విమర్శలు వస్తూనే ఉండేవి. ఈ బలహీనత కారణంగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అతన్ని కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం చేస్తూ, పలు […] -
Team India: 400 ప్లస్ స్కోర్‌తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
భారత క్రికెట్ జట్టు వన్డేల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. బుధవారం లక్నోలోని ఏకానా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌట్ అయి కొండంత స్కోరును బోర్డుపై ఉంచింది. వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ 400 ప్లస్ పరుగులు చేయడం ఇది ఎనిమిదో సారి. తద్వారా ఈ మైలురాయిని అత్యధిక సార్లు అందుకున్న జట్లుగా దక్షిణాఫ్రికాతో కలిసి భారత్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఏడు సార్లు, […] -
INDA Vs AFGA: ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. ఆప్ఘనిస్థాన్‌పై భారీ విజయం..
శ్రీలంకలో జరుగుతున్న ట్రై నేషన్ ఎ సిరీస్ 2026 టోర్నమెంట్లో భారత్ ఎ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సిరీస్‌లో భాగంగా జరిగిన 5వ వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఎ జట్టుపై భారత్ ఎ 101 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో మెరుగైన నెట్ రన్ రేట్ (+0.797) సాధించిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?