PBSK Owner Preity Zinta: ప్రీతి జింటా స్టేడియంలో ఎందుకు కనిపించడం లేదో తెలుసా..? కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) అద్భుత ప్రదర్శన చేస్తూ పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్నప్పటికీ.. ఆ జట్టు యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా స్టేడియంలో కనిపించకపోవడంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ అభిమానుల సందేహాలను పటాపంచలు చేశారు.
PBKS విజయాల జోరు..
పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రీతి జింటా ఒక ‘లక్కీ చార్మ్’ లాంటివారని అభిమానుల నమ్మకం. గత సీజన్ల వరకు తన జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరవుతూ, గ్యాలరీలో సందడి చేస్తూ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపేవారు. అయితే ఈ సీజన్‌లో పంజాబ్ వరుస విజయాలు సాధిస్తున్నా.. యజమాని మాత్రం గ్యాలరీలో కనిపించకపోవడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. “జట్టు ఇంత బాగా ఆడుతుంటే ప్రీతి జింటా ఎక్కడున్నారు?” అంటూ ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
పిల్లల కోసమే ఈ విరామం..
అభిమానుల ఆరాటాన్ని గమనించిన ప్రీతి జింటా సోషల్ మీడియా వేదికగా అసలు కారణాన్ని వెల్లడించారు. తన గైర్హాజరీకి గల కారణాలను వివరిస్తూ ఆమె ఇలా పేర్కొన్నారు. “గత కొంతకాలంగా షూటింగ్స్, ఇతర వ్యాపార పనుల వల్ల నా పిల్లలకు (జై, జియా) దూరంగా ఉన్నాను. ప్రస్తుతం వారికి స్కూల్ సెలవులు నడుస్తున్నాయి. అందుకే ఈ విలువైన సమయాన్ని వారితో గడపాలని నిర్ణయించుకున్నాను” అని ఆమె తెలిపారు.
ప్రస్తుతానికి పిల్లలతో కలిసి విహారయాత్రలో ఉన్నట్లు సమాచారం. అయితే.. లీగ్ చివరి దశకు చేరుకునే సమయానికి లేదా కీలకమైన ప్లే-ఆఫ్స్ మ్యాచ్‌ల సమయానికి తాను ఖచ్చితంగా స్టేడియానికి వచ్చి తన జట్టును ఉత్సాహపరుస్తానని ఆమె హామీ ఇచ్చారు. తాను స్టేడియంలో లేకపోయినా, ఇంటి నుంచే మ్యాచ్‌లను వీక్షిస్తున్నానని.. జట్టు సాధిస్తున్న వరుస విజయాలు చూసి చాలా గర్వంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రీతి జింటా ఇచ్చిన క్లారిటీతో పంజాబ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. “ఒక తల్లిగా పిల్లల కోసం మీరు తీసుకున్న నిర్ణయం అభినందనీయం.. త్వరలోనే మిమ్మల్ని స్టేడియంలో చూడాలని కోరుకుంటున్నాం” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ప్లే-ఆఫ్స్ రేసులో ముందంజలో ఉండటంతో.. కీలక మ్యాచ్‌లలో ప్రీతి జింటా ఇచ్చే సపోర్ట్ జట్టుకు మరింత బలాన్నిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?