New Railway Lines: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైల్వే లైన్లు అందుబాటులోకి.. ఈ ప్రాంతాల మధ్యనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే రాజమండ్రి – విశాఖపట్నం రైల్వే మార్గంలో ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు ఇది నిజంగా తీపి కబురు. గత దశాబ్ద కాలంగా పెరుగుతున్న రద్దీ వల్ల రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడవడం, క్రాసింగ్‌ల కోసం వేచి చూడటం ప్రయాణికులకు నిత్యం నరకంగా మారింది. అయితే.. కేంద్ర కేబినెట్ రూ. 9,889 కోట్ల భారీ బడ్జెట్‌తో 3, నాల్గవ లైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే రైళ్ల వేగం పెరగడమే కాకుండా, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రతిరోజూ ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం ఈ రెండు నగరాల మధ్య తిరిగే సామాన్యులకు ఇది గొప్ప ఊరటనిచ్చే అంశం. ప్రయాణం కేవలం గమ్యానికి చేరడమే కాకుండా, ఎంతో సౌకర్యవంతంగా మరియు సంతోషదాయకంగా మారనుంది.
రైల్వే శాఖ ప్రతిపాదించిన ఈ మెగా ప్రాజెక్టు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థను సమూలంగా మార్చనుంది. రాజమండ్రి నుంచి విశాఖపట్నం (దువ్వాడ) వరకు ఉన్న సుమారు 150-180 కిలోమీటర్ల మేర మూడవ, నాల్గవ రైల్వే లైన్ల నిర్మాణానికి రూ. 9,889 కోట్లు ఖర్చు చేయనున్నారు.
Also Read
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
Also Read:Fake Letters: పవన్ కళ్యాణ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఎర.. సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ..
ప్రస్తుతం ఉన్న లైన్లపై విపరీతమైన లోడ్ ఉంది. ప్యాసింజర్ రైళ్లతో పాటు గూడ్స్ రైళ్ల రాకపోకలు పెరగడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఇక్కడ మూడు, నాల్గవ లైన్లు అందుబాటులోకి వస్తే గూడ్స్ రైళ్లకు ప్రత్యేక మార్గం సుగమమై.. ఎక్స్‌ప్రెస్ రైళ్లు వేగంగా వెళ్లే అవకాశం ఉంటుంది.
విశాఖ పోర్ట్, గంగవరం పోర్ట్ , కాకినాడ సెజ్ నుంచి వచ్చే సరుకు రవాణాకు ఈ అదనపు లైన్ వెన్నెముకగా నిలుస్తుంది. ఇది ప్రయాణికులకే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా బలాన్నిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మధ్యలో ఉన్న ప్రధాన స్టేషన్లను ఆధునీకరించడం, వంతెనల నిర్మాణం, సిగ్నలింగ్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడం వంటి పనులు కూడా చేపడతారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!