Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
- ప్రభుత్వ వైఫల్యమే కారణం: హరీష్
- సీఎం రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్
- సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకోవడంపై ఆగ్రహం
- బాధితురాలికి రూ. కోటి డిపాజిట్ చేయాలన్న డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన ఆరుగురి హత్యోదంతంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘోర సామూహిక హత్య హృదయవిదారకమైనదని, ఈ ఘటనతో రాష్ట్రంలోని ఆడపిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వ పూర్తి వైఫల్యం వల్లే ఈ దారుణం జరిగిందని దుయ్యబట్టారు. న్యాయం కోసం బాధితులు నెలల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి అలసిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ ఘటనలో ముగ్గురు అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఇంత పెద్ద ఘోరం జరిగినా రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదని హరీష్ రావు విమర్శించారు.
హోంమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారు
ఈ దారుణానికి సీఎం రేవంత్ రెడ్డే పూర్తి బాధ్యత వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హోంమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యారని, ఆయనకు కొంచెమైనా మానవత్వం ఉంటే తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు, అవినీతికి లొంగిపోవడం వల్లే నిందితుడికి బెయిల్ వచ్చిందని ఆరోపించారు. ఒక పోక్సో (POCSO) కేసు నిందితుడు ఇంతటి దారుణానికి ఒడిగడుతుంటే, నెల రోజుల పాటు పరారీలో ఉన్నా పోలీసులు అతడిని పట్టుకోలేకపోవడం వారి చేతకానితనానికి నిదర్శనమన్నారు. నిందితుడికి ప్రభుత్వం, పోలీసులు పరోక్షంగా సహకరించారని ఆరోపించారు. ఈ కేసులో కేవలం ఒక ఎస్సైని సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు. ప్రస్తుతం పోలీసులు శాంతిభద్రతలను పక్కనబెట్టి, ల్యాండ్ సెటిల్మెంట్ల కోసం ఒక రాజకీయ వ్యవస్థగా మారిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
సబితా ఇంద్రారెడ్డి అడ్డుగింతపై ఆగ్రహం.. బాధితురాలికి రూ. కోటి డిపాజిట్ చేయాలి
బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు తమ ప్రతాపం చూపిస్తూ అడ్డుకోవడాన్ని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. తప్పు చేసిన దొంగలకు, హంతకులకు సహకరిస్తున్న పోలీసులు, పరామర్శించడానికి వెళ్లే విపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను నిమిషాల్లో అరెస్ట్ చేసే పోలీసులు.. హంతకులను ఎందుకు పట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ ఘటనలో ఆ కుటుంబంలో ఒకే ఒక్క అమ్మాయి ప్రాణాలతో బతికిందని, ఆమె కూడా దివ్యాంగురాలని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆ దివ్యాంగ అమ్మాయి భవిష్యత్తు కోసం ఆమె పేరు మీద కోటి రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) చేయాలని హరీష్ రావు గట్టిగా డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!