Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ యువకుడు చేసిన దారుణాలు గూగుల్ అలర్ట్‌తో బయటపడ్డాయి. తన గూగుల్ డ్రైవ్‌లో బాలికలు, మహిళలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను ఉంచుకున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గూగుల్ తన భద్రతా వ్యవస్థ ద్వారా అనుమానాస్పద కంటెంట్‌ను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
గూగుల్ అలర్ట్‌తో దర్యాప్తు:
పోలీసుల అందించిన వివరాల ప్రకారం.. గూగుల్ డ్రైవ్‌లో చట్టవిరుద్ధమైన బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన (CSAM) కంటెంట్ ఉన్నట్లు గూగుల్ గుర్తించింది. దీనితో చట్టపరమైన ప్రక్రియలో భాగంగా సంబంధిత అధికారులకు సమాచారం అందించింది. గూగుల్ అందించిన ఈ-మెయిల్ వివరాలు, IMEI నంబర్, IP అడ్రస్ వంటి డిజిటల్ ఆధారాల సహాయంతో సైబర్ పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
Also Read
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
మొబైల్లో అభ్యంతరకర వీడియోలు:
నిందితుడి వద్ద స్వాధీనం చేసుకున్న రెండు మొబైల్ ఫోన్లను పరిశీలించగా.. అందులో అనేక ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.
కంటెంట్‌పై నిఘా:
గూగుల్ డ్రైవ్‌లో నిల్వ చేసే కంటెంట్‌పై గూగుల్ భద్రతా వ్యవస్థలు నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తాయి. ముఖ్యంగా చట్టవిరుద్ధమైన కంటెంట్, బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన మెటీరియల్ (CSAM), ఉగ్రవాద ప్రచార కంటెంట్, కాపీరైట్ ఉల్లంఘనలకు సంబంధించిన ఫైళ్లు గుర్తిస్తే వాటిని ఫ్లాగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో గూగుల్ చట్టపరమైన నిబంధనల ప్రకారం సంబంధిత దర్యాప్తు సంస్థలకు సమాచారం అందిస్తుంది. అవసరమైతే ఖాతా వివరాలు, IP అడ్రస్, డిజిటల్ సమాచారాన్ని కూడా అధికారులతో పంచుకుంటుంది.
గూగుల్ డ్రైవ్ అనేది వ్యక్తిగత డేటా నిల్వ కోసం ఉపయోగపడే క్లౌడ్ సేవ అయినప్పటికీ.. చట్టవిరుద్ధమైన లేదా గూగుల్ విధానాలను ఉల్లంఘించే కంటెంట్‌ను అందులో నిల్వ చేయడం లేదా షేర్ చేయడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. అలాంటి కంటెంట్ గుర్తిస్తే గూగుల్ చర్యలు తీసుకోవడమే కాకుండా.. సంబంధిత దేశ చట్టాల ప్రకారం పోలీసులు కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!