Veerababu Burugadda
Author- NTV Telugu-
Drugs: డ్రగ్స్ సొమ్ముతో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు.. దర్యాప్తు వేగవంతం చేసిన ఈడీ..
హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్వహించిన సోదాల్లో కెటమైన్ డ్రగ్స్ అక్రమ రవాణా, మనీలాండరింగ్ నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది. 2019లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ ప్రారంభించింది. బెంగళూరులో జె. కన్నన్ వద్ద 26.75 కిలోల కెటమైన్, శివరాజ్ ఉర్స్ నిర్వహిస్తున్న రహస్య ల్యాబ్‌లో మరో 25.45 కిలోల డ్రగ్స్‌ను గతంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ తయారీకి హైదరాబాద్ కేంద్రంగా సహాయం అందించినట్లు ఈడీ […] -
Anganwadi Recruitment: అంగన్వాడీ ఉద్యోగాల నియామకం.. ఆ జిల్లాలకు మంత్రి సీతక్క డెడ్‌లైన్..
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరుపై మంత్రి సీతక్క ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ వ్యవస్థను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. అందులో భాగంగా అంగన్వాడీ టీచర్ల నుంచి నేరుగా సలహాలు, సూచనలు స్వీకరించేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల సమస్యలను తక్షణమే గుర్తించి వాటిని పరిష్కరించేలా చర్యలు […] -
Telangana Education: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 9 శాతం ఖర్చు చేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణను విద్యాపరంగా అగ్రగామిగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకే రాష్ట్ర బడ్జెట్లో ఏకంగా 9 శాతం నిధులను ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ఓట్ల రాజకీయం కోసం కాకుండా, పిల్లల బంగారు భవిష్యత్తును దిద్ది తీర్చాలనే ఏకైక లక్ష్యంతోనే విద్యాశాఖ బాధ్యతలను తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని తెలిపారు. గతంలో ఉన్నవారు […] -
CM Revanth Reddy: ‘2034 వరకు నేనే సీఎంగా ఉంటా.. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి’: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవీకాలంపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. “2034 వరకు ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, దీనిపై ఎవరూ ఎలాంటి అనుమానాలు, డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు” అని ధీమా వ్యక్తం చేశారు. ఫిన్లాండ్, జర్మనీ పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయుల బృందంతో ఇవాళ ఎంసీఆర్హెచ్ఆర్డీలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్వహణలో తాము మానవత్వంతో వ్యవహరిస్తూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా […] -
Vaibhav Sooryavanshi: అప్పుడే వైభవ్ సూర్యవంశీకి ప్రమోషన్.. వైస్ కెప్టెన్‌గా ఎంపిక..
వైభవ్ సూర్యవంశీ దూలేప్ ట్రోఫీ కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ ఈస్ట్ జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ సారథ్యం వహించనున్నాడు. సూర్యవంశీ ఇటీవల ముగిసిన యుకె పర్యటనలో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత జరిగిన జింబాబ్వే టి20 సిరీస్‌లో కూడా ప్రాతినిధ్యం వహించి, ఏకంగా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఆగస్టు 23 నుంచి బెంగళూరు […] -
Humanoid Robot: రూ.3,000 ఇస్తే చాలు… మీ ఇంట్లోని చెత్తంతా ఎత్తి పడేస్తుంది..
ఇంటి పరిసరాలు, వంటిల్లు, బాత్రూమ్లను శుభ్రం చేసి చెత్తను బయట పడేసే పనులను మనకు బదులుగా ఒక హ్యూమనాయిడ్ రోబోట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో దృశ్యంలా అనిపించినప్పటికీ, అమెరికాలో ఈ సేవలు నిజంగానే అందుబాటులోకి వచ్చాయి. ‘టావ్ రోబోటిక్స్’ అనే అమెరికన్ స్టార్టప్ హ్యూమనాయిడ్ రోబోల ద్వారా గృహ శుభ్రత సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సంస్థ సీఈఓ అలెగ్జాండర్ కోచ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వీడియో […] -
Love Fail: లవర్ హ్యాండ్ ఇచ్చాడని మనస్తాపం… సీపీఆర్ చేసినా దక్కని యువతి ప్రాణాలు..
ప్రేమించడమే ఆమె పాలిట శాపమైంది.. తను ప్రేమించిన వ్యక్తి.. పెళ్లికి నో చెప్పడంతో ఆ యువతి తట్టుకోలేకపోయింది. మనస్థాపంతో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసింది. విషాదకరమైన ఈ ఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగింది. ఐతే సహచర ఉద్యోగికి వీడియో కాల్ చేసి మరీ బలవన్మరణం చెందడం కలకలం రేపింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో తండి పీతాంబర్ కుటుంబతో సహా నివాసం ఉంటున్నాడు. నిజానికి అతడి స్వస్థలం ఒడిశా. పీతాంబర్ ఒడిశాకు చెందిన విశ్రాంత […] -
Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్, జైళ్ల శాఖలలో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి 4 నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 7,437 ఖాళీలను భర్తీ చేయనున్నారు. శాఖల వారీగా వివరాలు చూస్తే.. పోలీస్ శాఖలో సబ్ ఇన్ స్పెక్టర్ (సివిల్) 148, రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ (AR) 14, రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ (TGSP) 12, రిజర్వ్ […] -
LPG eKYC: ఎల్పీజీ కేవైసీ అప్డేట్ మెసేజ్ వచ్చిందా..? అయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి..
మీ మొబైల్‌కు ‘మీ LPG కనెక్షన్ నిలిపివేయబడుతుంది’, ‘వెంటనే KYC అప్డేట్ చేయండి లేదా గ్యాస్ సబ్సిడీ ఆపివేయబడింది అని సందేశం వస్తే.. దానిని పరిశీలించకుండా గుడ్డిగా నమ్మడం చాలా ప్రమాదకరం. దేశవ్యాప్తంగా LPG సేవలకు సంబంధించి ఆన్లైన్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ICICI బ్యాంక్ తన వినియోగదారులకు ఒక ప్రత్యేక హెచ్చరికను జారీ చేసింది. సైబర్ నేరగాళ్ళు గ్యాస్ కనెక్షన్, LPG సబ్సిడీ, KYC అప్డేట్ వంటి అత్యవసర సేవల పేరుతో భయాందోళనలు […] -
Honor X6e Launched: 7,500mAh బ్యాటరీ, TFT LCD స్క్రీన్, 4GB ర్యామ్+ 128GB స్టోరేజ్ రూ.16 వేలకే..
ఆనర్ (Honor) కంపెనీ కొత్తగా Honor X6e స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. 4G కనెక్టివిటీతో వస్తున్న ఈ బడ్జెట్ ఫోన్ ధరకు తగ్గట్టుగా ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తోంది. డిజైన్, డిస్ప్లే విషయానికొస్తే.. ఇందులో 6.61-అంగుళాల TFT LCD స్క్రీన్ ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1010 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు కళ్ళకు రక్షణనిచ్చే ‘ఐ కంఫర్ట్’, ‘డైనమిక్ డిమ్మింగ్’ సాంకేతికతలను సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ గీతలు పడకుండా ‘అలుమినోసిలికేట్’ గ్లాస్ ప్రొటెక్షన్ […]
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!