తమిళనాడులో (Tamil Nadu) స్టాలిన్ సర్కార్ (CM Stalin Government) మరోసారి విమర్శల పాలైంది. ఇటీవలే భారత్ రాకెట్‌పై చైనా జెండా బ్యానర్ వేసి రాష్ట్రంలోని విపక్ష పార్టీల నుంచి.. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు మూటగట్టుకుంది. తాజాగా మరో బ్యానర్ ఇప్పుడు విమర్శల పాలైంది.
కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ (Justice Abhijit) రాజీనామా చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.
విద్యపై ముంబై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ సంస్కృతిలో ఒకప్పుడు విద్యకు ఎంతో పవిత్రత ఉండేదని, కానీ ప్రస్తుతం అటువంటి విద్య విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోయిందని బాంబే హైకోర్టు (Bombay High Court) వ్యాఖ్యానించింది.
కల్పనా సోరెన్.. తన భర్తను తలచుకుని స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. సోమవారం ఆమె రాజకీయ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగిస్తూ తన భర్త, మాజీ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.
రంజాన్ (Ramzan) సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు యూఏఈ (UAE) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పవిత్ర మాసంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పని గంటలు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
హైతీలో సాయుధ మూకలను అదుపు చేయడం కోసం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. హైతీ రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్లో ఘోరమైన నేరాలు చేసే వారిని బంధించే జైలును బద్దలు కొట్టుకొని వందలాది మంది ఖైదీలు పరారయ్యారు.