రంజాన్ (Ramzan) సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు యూఏఈ (UAE) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పవిత్ర మాసంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పని గంటలు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రంజాన్ సందర్భంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు రోజుకు రెండు పని గంటల తగ్గింపు ఉంటుందని మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కంపెనీలు రోజువారీ పని గంటల్లో ఆయా పరిస్థితులను బట్టి వర్కింగ్ అవర్స్‌ను తగ్గించాలని సూచించింది.
ఇదిలా ఉంటే ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ (FAHR) ఒక సర్క్యులర్‌లో పని దినం సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నడుస్తుందని తెలిపింది.
ఈ సంవత్సరం UAEలో రంజాన్ మార్చి 12న (మంగళవారం) ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. అయితే చంద్రుని వీక్షించే సంప్రదాయం ఆధారంగా రంజాన్ ప్రారంభం యొక్క ఖచ్చితమైన తేదీకి దగ్గరగా నిర్ధారించబడుతుంది.
The Ministry announces a reduction of 2 working hours per day for private sector employees during the Holy Month of Ramadan.
The Ministry said: “In accordance with the requirements and nature of their work, companies may apply flexible or remote work patterns within the limits…
— وزارة الموارد البشرية والتوطين (@MOHRE_UAE) March 4, 2024